వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్లు ఎలా కొంటున్నారు?: ఆదాయపన్నుపై జైట్లీ షాకింగ్ కామెంట్స్

ఆదాయప పన్ను శాఖ రిటర్న్ ఫైల్ చేస్తున్న వారు కొద్దిమందేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. పన్ను కట్టే వారి పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆదాయప పన్ను శాఖ రిటర్న్ ఫైల్ చేస్తున్న వారు కొద్దిమందేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బుధవారం నాడు జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పన్ను కట్టే వారి పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చాలామంది తమ ఆదాయాన్ని తక్కువగా చూపిస్తున్నారని చెప్పారు. ఐటీ రిటర్న్స్ తక్కువ మంది ఫైల్ చేస్తున్నందున.. ఆ సంఖ్య పెంచేలా చూస్తామని చెప్పారు.

<strong>బడ్జెట్ విశేషాలు 2017-18</strong>బడ్జెట్ విశేషాలు 2017-18

ఆదాయం తక్కువ ఉంటునన్న వారు కార్లు ఎలా కొంటున్నారో చెప్పాలన్నారు. పన్నులు ఎగ్గొడుతున్న వారి ప్రభావం నిజాయితీపరుల పైన పడుతోందన్నారు.

Union budget 2017: income tax slabs for individuals

పన్నులు కట్టే అలవాటు పెద్దగా లేదు

భారత దేశంలో పన్నులు కట్టే అలవాటు పెద్దగా లేదని చెప్పారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారు కోటీ 72 లక్షల మందేనని చెప్పారు. పన్నుల పరిధిని విస్తరిస్తామని తెలిపారు. 5 లక్షల 94వేల కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు ఐటీ రిటర్న్స్ వచ్చాయని చెప్పారు. పన్ను ఎగవేయవద్దని చెప్పారు.

రూ.50 లక్షలకు పైగా ఆస్తులు చూపిస్తున్న వారు 1.72 లక్షల మంది అని, 99 లక్షల మంది 2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం చూపిస్తున్నారని చెప్పారు. నోట్ల రద్దు తర్వాత 1.48 లక్షల బ్యాంకు అకౌంట్లలో రూ.80 లక్షల కోట్లు వరకు వచ్చి చేరాయన్నారు.

English summary
Number of people showing income of over Rs 50 lakh is only 1.72 lakh. From amongst 3.7 crore who filed tax returns, 99 lakh showed income below Rs 2.5 lakh. Deposits of over Rs 80 lakh made in 1.48 lakh bank accounts post demonetisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X