కేంద్ర బడ్జెట్ 2018: మహిళలకు తాయిలాలు ప్రకటించిన ఆర్థిక మంత్రి!
న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు కొన్ని తాయిలాలు ప్రకటించారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. గ్రామీణ, పట్టణ, పేద, ఉద్యోగులు... ఇలా అన్ని రంగాల్లోని మహిళలకు మేలు చేసే అంశాలు కనిపిస్తున్నాయి.
కేంద్ర బడ్జెట్ 2018: వాహనదారులకు ఊరట.. తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు?
ముద్రా యోజన క్రింద రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త వెంచర్లు ఏర్పాటు చేయాలనుకునే మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. అలాగే ఉజ్వల యోజన కింద ప్రస్తుతం 5 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇస్తున్నారు. తాజా బడ్జెట్‌లో దీని పరిమితిని 8 కోట్లకు పెంచారు.

ఇక మహిళా స్వయం సహాయ బృందాలకు ఇచ్చే రుణాలను 37 శాతం పెంచారు. ఉద్యోగుల భవిష్య నిధికి అన్ని రంగాల్లో ఉద్యోగులకు వారి వేతనంపై 12 శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. రానున్న మూడేళ్ళకు ఇది వర్తిస్తుంది.
ఫలితంగా ఉద్యోగినులు చెల్లించవలసిన సొమ్ము తమ వేతనంపై 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గింది. అలాగే ఉద్యోగుల భవిష్య నిధికి మహిళల కంట్రిబ్యూషన్ తగ్గడంతో యజమానులు మహిళలను నియమించుకోవడం పెరుగుతుంది.