వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర బడ్జెట్ 2018: జైట్లీ షాక్... స్టాక్ మార్కెట్లు ఢమాల్, తీవ్ర నిరాశలో మదుపరులు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : 2018-19 కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఇచ్చిన షాక్‌తో గురువారం మధ్యాహ్నం స్టాక్‌మార్కెట్లు ఢమాల్ అన్నాయి. లక్షకు పైగా పెట్టుబడులుపై 10 శాతం ఎల్‌టీసీజీ(దీర్ఘకాలిక మూలధన పన్ను)ను విధించనున్నట్టు ప్రకటించడంతో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలిపోయాయి.

సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు కిందకి పడిపోయింది. ప్రస్తుతం కొంత కోలుకుని 56 పాయింట్ల నష్టంలో 35,908 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా ఆ ప్రకటనతో 119 పాయింట్లు నష్టపోయింది.

మరోవైపు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగానే కొనసాగనున్నట్టు జైట్లీ పేర్కొన్నారు. ఎల్‌టీసీజీ విధింపుపై ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఒకవైపు పార్లమెంట్‌లో జైట్లీ ప్రసంగిస్తుండగానే స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.

 Union Budget 2018: Sensex, Nifty Rattled With 10% Capital Gains Tax

భారీ పరిశ్రమలకు కూడా కార్పొరేట్‌ పన్నులపై ఎలాంటి మినహాయింపులు బడ్జెట్‌లో ఇవ్వకపోవడం కూడా పారిశ్రామిక వర్గాలను తీవ్రంగా నిరాశపరిచింది. గురువారం ప్రారంభంలో లాభాల్లోనే కొనసాగిన స్టాక్ మార్కెట్లు బడ్జెట్ ప్రసంగం మొదలైన కాసేపటికే కుదేలయ్యాయి.

మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో సెన్సెక్స్‌ 73 పాయింట్లు కోల్పోయి 35,892 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 11,005 వద్ద ట్రేడ్‌ అవగా ఆ తరువాత ఈ పతనం మరింత అధికమైంది.

తిరిగి రెండు గంటల ప్రాంతంలో మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 235 పాయింట్లు కోల్పోయి 36,200 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 11,062 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

English summary
After staying in red for some time and oscillating between highs and lows for half the day, Sensex swings back to green. Sensex surges 235 points to trade at 36,200 points. Nifty rose 34 points, or 0.31%, to trade at 11,062 points. Before this, Sensex had fallen by 463 points to the day's low of Rs. 35,501.74 against the previous session's closing of 35,965.02. Nifty had also fallen by 148 points to 10,878.80 against the previous session's closing of 11,027.70 points. This happened after finance minister Arun Jaitley announced 10% tax on LTCG of Rs. 1,00,000 on equity or equity mutual funds. The gains will accrue if the shares are sold after holding for one year. Sensex and Nifty pared the early gains after Union Finance Minister (FM) Arun Jaitley presented the Budget in Parliament for the financial year 2018-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X