వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిసారి ఇల్లు కోంటే బంపర్ ఆఫర్: రూ. 3.5 లక్షలు రాయితీ, ప్రస్తుతం సగం జీతాలు అద్దెలకే !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సొంత ఇల్లు తొలిసారి కొనుగోలు చేసే వారికి ప్రోత్సహకాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతరామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.

రూ. 45 లక్షల లోపు ఇల్లు కొంటే రూ. 3.5 లక్షల వరకు వడ్డీ రాయితీ కల్పిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదే విధంగా హోం లోన్ తీసుకునే వారికి మరో రూ. 1.5 లక్షలు వడ్డీ రాయితీ ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

Union budget 2019: 3.5 lakh tax benefit on interest rate of housing loan value of Rs 45 lakh.

హౌజింగ్ ఫైనాన్స్ రంగాన్ని రిజర్వ్ బాంక్ పరిధిలోకి తీసుకువస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. ప్రస్తుతం మద్య తరగతి వారు అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నారని, వారి జీతాల్లో సగం భాగం అద్దెలు చెల్లిస్తున్నారని, ఇలాంటి వారు సొంత ఇల్లు కొనుగోలు చెయ్యడానికి అవకాశం కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రస్తుతం అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటున్నవారు హోంలోన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో మధ్యతరగతి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద రూ. 45 లక్షల లోపు ఇల్లు కొనుగోలు చేసేవారికి కేంద్రం చక్కటి అవకాశం కల్పించింది.

English summary
Union budget 2019: 3.5 lakh tax benefit on interest rate of housing loan value of Rs 45 lakh. Previously tax benefit amounted to Rs 2 lakh. Now increased by 1.5 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X