వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌లో ఏపీ-టికి కేటాయింపులు...:పెట్రోల్‌పై భారం, ఇళ్లు కొంటే గుడ్‌న్యూస్, బంగారం ఖరీదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం (జూలై 5) బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆమె గం.2.15 నిమిషాలు ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం రెండోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చాక, అలాగే, నిర్మల ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది. ఆదాయపన్ను పరిమితిలో మార్పు లేదు. పెట్రోల్, డీజిల్ పైన రూ.1 సెస్ విధిస్తున్నారు. రూ.45 లక్షల హోమ్ లోన్స్ పైన రూ.3.5 లక్షల వరకు వడ్డీ రాయితీ. ఏడాదికి రూ.కోటి దాటిన విత్ డ్రాయల్స్ పైన 2 శాతం వడ్డీ.. ఇలా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Union Budget 2019 Live updates: Nirmala sitharaman to introduce

Newest First Oldest First
5:19 PM, 5 Jul

కేంద్ర బడ్జెట్‌లో విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సహకాలు ఇచ్చే పథకాలు లేవని మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్‌ నేత రేవంత్ రెడ్డి అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే వస్తున్నాయన్నారు.
5:19 PM, 5 Jul

కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ నిరాశపరిచిందని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదన్నారు.
5:18 PM, 5 Jul

బడ్జెట్ పైన తెలుగు రాష్ట్రాల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
3:38 PM, 5 Jul

పెట్రోల్, డీజిల్ పైన అదనంగా రూ.1 సెస్ విధించాలని కేంద్రం నిర్ణయించడంతో పెట్రో సంస్థల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
2:51 PM, 5 Jul

సమీకృత ఆర్థిక అభివృద్ధి లక్ష్యమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
2:48 PM, 5 Jul

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. పదేళ్ల విజన్‌తో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు.
2:20 PM, 5 Jul

ఇది ముందుచూపు కలిగిన బడ్జెట్ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకువెళ్లాలనే ప్రధాని మోడీ కలలను సాకారం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. గ్రామాలు, పేదవారిని, రైతులకు ప్రయోజనకారిగా ఉందన్నారు.
2:18 PM, 5 Jul

బడ్జెట్ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. మధ్యాహ్నం బీఎస్‌ఈ సెన్సెక్స్ 448 పాయింట్లు నష్టపోయి 39,555 వద్ద ట్రేడ్ అయింది. 352 పాయింట్లు నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 140కి పైగా పాయింట్ల నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.68.47గా ఉంది.
2:18 PM, 5 Jul

బడ్జెట్ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. మధ్యాహ్నం బీఎస్‌ఈ సెన్సెక్స్ 448 పాయింట్లు నష్టపోయి 39,555 వద్ద ట్రేడ్ అయింది. 352 పాయింట్లు నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 140కి పైగా పాయింట్ల నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.68.47గా ఉంది.
1:50 PM, 5 Jul

పల్లెలు, పేదల అభ్యున్నతికి ఈ బడ్జెట్ బాటలు వేస్తుందన్నారు. అయిదేళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పన్నుల విధానం సరళీకరణ దిశగా సాగుతోందన్నారు.
1:48 PM, 5 Jul

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. బడ్జెట్ అద్భుతంగా ఉందని చెప్పారు.
1:48 PM, 5 Jul

బడ్జెట్ ప్రసంగం అనంతరం సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోయింది.
1:46 PM, 5 Jul

బడ్జెట్ మార్కెట్లకు రుచించినట్లుగా లేదు. మార్కెట్లు భారీగా పతనమయ్యాయి.
1:20 PM, 5 Jul

ఏయే రంగానికి ఎంత కేటాయించామనేది బడ్జెట్ రిపోర్టులో పొందుపర్చామని, అవి ప్రత్యేకించి చదవలేదని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.
1:19 PM, 5 Jul

ఆటో పార్ట్స్ సీసీటీవీలపై పన్ను పెంపు
1:09 PM, 5 Jul

పెట్రోలుపై రూపాయి సెస్.
1:07 PM, 5 Jul

రూ.400 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలు ఇక నుంచి 25 శాతం పరిధిలోకి వస్తాయి.
1:06 PM, 5 Jul

వ్యక్తి ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు.
1:05 PM, 5 Jul

మధ్యతరగతి గృహ రుణాలపై మరికాస్త ఊరట. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేస్తే ప్రోత్సాహకాలు. రూ.45 లక్షలు లోపు గృహరుణాలపై రూ.3.5లక్షలు వడ్డీ రాయితీ. వడ్డీ రాయితీ రూ.2 లక్షల నుంచి రూ.3.50లక్షలకు పెంపు.
1:03 PM, 5 Jul

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 121వ ర్యాంకులో భారత్.
1:01 PM, 5 Jul

డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు చర్యలు. కస్టమర్ డిజిటల్ పేమెంట్స్ పైన సర్వీస్ ఛార్జీలు రద్దు.
1:01 PM, 5 Jul

ఏడాదికి రూ.కోటి దాటిన విత్ డ్రాయల్స్ మీద 2 శాతం టీడీఎస్.
1:01 PM, 5 Jul

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 121వ ర్యాంకులో భారత్.
1:00 PM, 5 Jul

- గృహ రుణాలు తగ్గనున్నాయి. గృహ రుణాలపై అదనంగా రూ.లక్షన్నర వడ్డీ తగ్గింపు. మొత్తంగా హోమ్ లోన్ పైన రూ.3.5 లక్షల వరకు వడ్డీ మాఫీ.
12:59 PM, 5 Jul

120 కోట్ల మంది ఆధార్ కార్డులు కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు పాన్‌కార్డ్ లేకుంటే ఆధార్ చూపించవచ్చు. రెండింట్లో ఏదైనా చూపించవచ్చు.
12:57 PM, 5 Jul

పాన్ కార్డుకు బదులు ఆధార్ కార్డు. ఐటీ రిటర్న్స్‌కు ఆధార్ లేదా పాన్‌కార్డ్.
12:53 PM, 5 Jul

డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్లు 78 శాతం పెరిగాయి. ట్యాక్స్ కలెక్షన్లు 2013-14 రూ.6.38 కోట్ల నుంచి ఇప్పుడు 11.27 కోట్లకు పెరిగాయి.
12:52 PM, 5 Jul

స్టార్టప్‌లకు ఐటీ స్క్రూటినీ నుంచి మినహాయింపు.
12:48 PM, 5 Jul

రూ.400 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకు 25 శాతం కార్పోరేట్ పన్ను మినహాయింపు.
12:46 PM, 5 Jul

వాహనాలపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతం. ఎలక్ట్రికల్స్‌పై తగ్గింపుకు జీఎస్టీ కౌన్సెల్ ఆమోదం. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధరలు తగ్గనున్నాయి.
READ MORE

English summary
The Narendra Modi 2.0 government is all set to present the 2019 Union Budget on July 5. The newly appointed Finance Minister Nirmala Sitharaman will be making history as she will be the first full time woman finance minister in India to present the Budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X