వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఆ లిమిట్ రూ. 5 లక్షలు, బ్యాంకులు దీవాలా తీస్తే, సూపర్, లక్కీచాన్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2020- 21 ఆర్థిక బడ్జెట్ లో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. బ్యాంక్ డిపాజిట్లపై ఉన్న ఇన్సూరెన్స్ పరిమితిని ఐదు రెట్లు పెంచుతామని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కస్టమర్లకు తీపికబురు చెప్పారు. బ్యాంకులు దీవాలా తీసి వాటిని పూర్తిగా మూసివేసినప్పుడే ఈ ఇన్సూరెన్స్ మొత్తం ఖాతాదారులకు అందుతుంది.

ఐ యామ్ వెయిటింగ్, బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా, బడ్జెట్ 2020ను క్యాన్సర్ తో పోలుస్తూ ట్వీట్!ఐ యామ్ వెయిటింగ్, బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుదార్ షా, బడ్జెట్ 2020ను క్యాన్సర్ తో పోలుస్తూ ట్వీట్!

ప్రస్తుతం ఇదీ పరిస్థితి

ప్రస్తుతం ఇదీ పరిస్థితి

ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లపై ఖాతాదారులకు కేవలం రూ. 1 లక్ష మాత్రమే ఇన్సూరెన్స్ లభిస్తోంది. అయితే 2020- 21 ఆర్థిక బడ్జెట్ లో బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ పరిమితిని ఏకంగా రూ. 5 లక్షలు పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఇన్సూరెన్స్ గ్యారెంటీ !

ఇన్సూరెన్స్ గ్యారెంటీ !

బ్యాంకుల్లో ప్రజలకు సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్సెడ్ అకౌంట్స్, రికవరింగ్ అకౌంట్స్ తదితర రకాల బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. ఇలా ఏ రకమైన బ్యాంకు అకౌంట్ ఉన్నా రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీపీ) ఈ ఇన్సూరెన్స్ మొత్తాన్ని బ్యాంకు ఖాతాదారులకు అందిస్తుంది.

బ్యాంకులు దీవాలా తీస్తే ఇలా !

బ్యాంకులు దీవాలా తీస్తే ఇలా !

బ్యాంకులు దివాలా తీసినప్పుడు అందులో డిపాజిట్ కలిగిన వారికి గతంలో రూ. 1 లక్ష ఇన్సూరెన్స్ ను అందిస్తున్నారు. ఇక ముందు బ్యాంకులు దివాలా తీస్తే ప్రతి ఖాతాదారుడికి రూ. 5 లక్షలకు ఇన్సూరెన్స్ అందించనున్నారు. బ్యాంకు ఖాతాదారులకు ఈ ఇన్సూరెన్స్ కాల పరిమితి పెంచడంతో ప్రతి ఒక్కరికి లాభాం చేకూరుతుంది.

బ్యాంకులు పూర్తిగా మూసేయాలి !

బ్యాంకులు పూర్తిగా మూసేయాలి !

బ్యాంకులు దీవాలా తీసి వాటిని పూర్తిగా మూసివేసినప్పుడే ఈ ఇన్సూరెన్స్ మొత్తం ఖాతాదారులకు అందుతుంది. ఇలా బ్యాంకులు మూతపడకపోతే ఇన్సూరెన్స్ ఖాతా దారులకు చేరదు. ప్రతి బ్యాంకుకు ఈ కొత్త నిబంధనలు వర్థిస్తాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ రూల్ తో ప్రతి బ్యాంకు ఖాతాదారుడికి లాభం చేకూరే అవకాశం ఉంది.

English summary
Union Budget 2020:Union Budget 2020 insurance coverd on Banks fds, deposits increased to Rs 5 laks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X