వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్‌ఐసీ వాటాలు అమ్మితే తప్పేంటి? రాహుల్‌పై విరుచుకపడ్డ పియూష్ గోయల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

#Budget2020 : Government To Sell Its Stake In IDBI Bank & LIC To Private Investors

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్‌ఐసీ)లో చిన్న మొత్తం మేర ప్రజలకు చేరితే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. ఎల్ఐసీలో ఉన్నది ప్రజల సొమ్ము. దానిని ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో తప్పేమీ లేదు. చిన్న మొత్తం ప్రజల వద్దకు వెళితే ఎలాంటి నష్టం ఉండదు అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు.

తాజా బడ్జెట్‌‌తో రాహుల్ గాంధీ అంతగా సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. ఒకవేళ ఆయనకు అంశాల వారీగా ఏదైనా ప్రశ్నలు ఉంటే వాటికి నేను సంపూర్ణంగా జవాబులు ఇస్తాను. ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో ఏవో కొన్ని పదాలతో బడ్జెట్ తప్పుపట్టడం సరికాదు. టెవీలలో మాట్లాడాలంటే ఆయన కంటే నేను పదింతలు మాటలు ఎక్కువగా చెబుతాను అని పియూష్ గోయల్ అన్నారు.

Union budget 2020: Piyush Goyal fires on Rahul Gandhi

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గురించి మాట్లాడుతూ.. పరిశ్రమల శాఖ పట్ల పలు వ్యాపార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. వారి స్పందన అద్భుతంగా ఉంది. భారీ పెట్టుబడులకు ఎక్కువ ఆస్కారం ఉన్న దేశంగా విదేశీ వ్యాపార వేత్తల్లో అభిప్రాయం వ్యక్తమైంది అని పియూష్ గోయల్ పేర్కొన్నారు.

English summary
Union budget 2020: Rahul Gandhi didn't seem very enthused with the budget, if he has any issue-based questions I can answer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X