LIVE
HIGHLIGHTS
SPONSOR Tata
  • కాంగ్రెస్ నేత  కేసీ వేణుగోపాల్
    ఈ బడ్జెట్ నిరుద్యోగం & ధరల పెరుగుదల ప్రస్తావన లేదు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్
  • పంజాబ్ సీఎం భగవంత్ మాన్
    వందేభారత్ రైళ్లను నడపాలని కోరాం.. కానీ.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్
  • మల్లికార్జున్ ఖర్గే
    అసెంబ్లీ ఎన్నికలను దృష్టితోనే బడ్జెట్ మల్లికార్జున్ ఖర్గే
  • ఉత్తరాఖండ్ సిఎం పిఎస్ ధామి
    ఇది అద్భుతమైన బడ్జెట్‌ ఉత్తరాఖండ్ సిఎం పిఎస్ ధామి
  • K సురేష్, కాంగ్రెస్ LS చీఫ్ విప్
    గత 3 బడ్జెట్‌లు కార్పొరేట్ & ఉన్నత-తరగతిపై దృష్టి సారించాయి K సురేష్, కాంగ్రెస్ LS చీఫ్ విప్
  • మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
    ఈ బడ్జెట్ ప్రతి రాష్ట్రానికి సంక్షేమం కోసం ఉద్దేశించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
Union budget 2023: కొత్త పన్ను విధానం ఆకర్షణీయంగా ఉంటుంది: నిర్మలా సీతారామన్..

Union budget 2023: కొత్త పన్ను విధానం ఆకర్షణీయంగా ఉంటుంది: నిర్మలా సీతారామన్..

ఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగస్తులు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కొందరిని మాత్రం నిర్మలమ్మ తన బడ్జెట్‌తో సంతృప్తి పరచగలిగారు. ఈ సారి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ పై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Union Budget 2023-24 LIVE News Updates, Expectations and Highlights in Telugu

2024 సాధారణ ఎన్నికలకు ముందు పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది కావడంతో అందరి దృష్టి ఈ 2023-24 బడ్జెట్‌పై పడింది. ఇక బడ్జెట్ సమావేశాలు కూడా చాలా వాడీవేడీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చాలా రంగాల్లో కోతలున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుని ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిన కారణంగా ఈ సారి బడ్జెట్‌ పై పెద్ద అంచనాలే ఉన్నప్పటికీ అరకొర తప్ప ఎక్కువగా తాయిలాలు లేవనే చర్చ ప్రారంభమైంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడంతో ఇటు అధికార పక్షం అటు విపక్షాల మధ్య మాటల యుద్ధం వాడీవేడీగా కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశాలు ఏప్రిల్ 6వరకు కొనసాగుతున్నాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఒక్కరోజు ముందు అంటే జనవరి 31వ తేదీన ఆర్థిక సర్వేను పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పూర్తి వివరాలు లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

8:03 PM
Feb 1, 2023
ఇది పేదల వ్యతిరేక బడ్జెట్.. భవిష్యత్తు కాదు. ఇది పూర్తిగా అవకాశవాద బడ్జెట్. ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం మధ్య, ఆదాయపు పన్ను మినహాయించడం వల్ల ప్రయోజనం ఏమిటి? బడ్జెట్‌లో నిరుద్యోగుల కోసం ఎలాంటి ప్రతిపాదన లేదు: కేంద్ర బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
8:01 PM
Feb 1, 2023
పార్టీ కంటే దేశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే.. బడ్జెట్ ఇంకా బాగుండేది: బీఎస్పీ అధినేత్రి మాయావతి
8:00 PM
Feb 1, 2023
ప్రతిపక్షంలో ఉన్నందున అసంతృప్తితో ఉన్నారు. ఆచరణాత్మక మార్పును, పాలనా స్వభావంలో మార్పును ప్రవేశపెట్టిన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రిని చూసినందున వారు అసంతృప్తితో ఉన్నారు. ఈ బడ్జెట్ సామాన్యుల కోసమే: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి
7:59 PM
Feb 1, 2023
కేంద్ర బడ్జెట్: ఈకోర్టుల ప్రాజెక్టుకు రూ. 7000 కోట్ల కేటాయింపు న్యాయ బట్వాడాను మెరుగుపరుస్తుందని, డిజిటల్ వాతావరణాన్ని సులభతరం చేస్తుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చెప్పారు
7:58 PM
Feb 1, 2023
సమ్మిళిత, వృద్ధి ఆధారిత, దూరదృష్టితో కూడిన బడ్జెట్‌ ఇది అని.. ప్రధాని మోడీ, సీతారామన్‌లను నడ్డా ప్రశంసించారు
7:58 PM
Feb 1, 2023
ఈ బడ్జెట్‌లో వృద్ధి, అభివృద్ధి విజన్ ఉంది. గ్రామాల్లోని ప్రజలు, మహిళలు, పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. దీనివల్ల 130 కోట్ల మంది భారతీయులకు సాధికారత లభిస్తుంది. ఇంత ప్రగతిశీల బడ్జెట్‌ను రూపొందించినందుకు ప్రధాని మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
7:56 PM
Feb 1, 2023
Nothing for poor but "election speech": Mallikarjun Kharge on Union Budget
7:13 PM
Feb 1, 2023
కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలను కలుపుకొని ఉంది, నారీ శక్తిని ప్రతిబింబిస్తుంది, అగ్ర 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మనల్ని తీసుకెళ్తుంది: సీనియర్ బీజేపీ నాయకులు
7:09 PM
Feb 1, 2023
వందే భారత్ రైళ్లను కూడా యూపీలోని రాయ్ బరేలీలో తయారు చేయనున్నారు. 'బుల్లెట్ ట్రైన్'లో మంచి పురోగతి సాధిస్తున్నాం. మహారాష్ట్రలో గతంలో సీఎం ఉద్ధవ్ థాక్రే అనుమతి ఇవ్వలేదు కానీ ఇప్పుడు అన్ని అనుమతులు ఉన్నాయి: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
7:07 PM
Feb 1, 2023
దేశంలో నివసిస్తున్న 140 కోట్ల మంది ప్రజలకు ఈ బడ్జెట్ బొనాంజా. ఇది అన్ని రంగాల ప్రజల గురించి ఆలోచించిన బడ్జెట్, ఉపాధికి మూలం. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో ప్రధాని మోడీ పాత్రను ప్రపంచం మెచ్చుకుంది: కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
7:05 PM
Feb 1, 2023
2047 కలలను సాధించడానికి మధ్యతరగతి చాలా పెద్ద శక్తి.. ప్రభుత్వం వారితో నిలిచింది: 2023 బడ్జెట్‌పై ప్రధాని మోడీ
6:42 PM
Feb 1, 2023
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి కూడా నిరుద్యోగం అనే పదాన్ని ప్రస్తావించలేదని ధ్వజమెత్తారు. బడ్జెట్ పై ఆయన బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
6:42 PM
Feb 1, 2023
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
6:24 PM
Feb 1, 2023
రైల్వేలకు రూ.2.41 లక్షల కోట్లు కేటాయించారు. ఇది పెద్ద మార్పు,ఇది ప్రయాణీకుల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. 'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద, 1275 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తున్నారు. వందేభారత్ రైళ్ల ఉత్పత్తిని పునరుద్ధరిస్తాం: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
5:46 PM
Feb 1, 2023
ఇటీవల గణతంత్ర వేడుకల్లో పంజాబ్ మిస్సయ్యిందని, ఇప్పుడు బడ్జెట్‌లోనూ పంజాబ్ ప్రస్తావనే లేదని సీఎం భగవంత్ మాన్ వ్యాఖ్యానించారు.
5:20 PM
Feb 1, 2023
CPI, WPI రెండూ ద్రవ్యోల్బణాలు తగ్గడం మీరు చూశారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
5:13 PM
Feb 1, 2023
అమృత్‌సర్, బటిండా నుంచి ఢిల్లీకి వందేభారత్ రైళ్లను నడపాలని కోరినా.. ఇవ్వలేదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు.
5:05 PM
Feb 1, 2023
జీవనోపాధిని కొనసాగించడం కోసం గత సంవత్సరం బడ్జెట్‌లో PM డివైన్ అనే నిర్దిష్ట కార్యక్రమంతో ముందుకు వచ్చామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
4:59 PM
Feb 1, 2023
ఏ పెట్రోలియం ఉత్పత్తిపైనా నేరుగా సబ్సిడీ ఉండదు. పన్ను విధానంలో పెనుమార్పు వస్తేనే పెట్రోల్ ధరపై ప్రభావం పడుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
4:30 PM
Feb 1, 2023
కొత్త పన్నుల విధానంలో తాజా ప్రోత్సాహకాలు ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తద్వారా ప్రజలు పాత పన్ను విధానం నుంచి కొత్త పన్ను విధానంలోకి వెళ్లాల్లొచ్చని పేర్కొన్నారు. మేము ఎవరినీ బలవంతం చేయడం లేదన్నారు.
4:28 PM
Feb 1, 2023
ప్రాజెక్ట్‌లు చేపట్టినప్పుడు, డబ్బును ఖర్చు పెట్టినప్పుడు మానవశక్తి లేకుండా పనులు పూర్తి చేయలేమని నిర్మలా సీతారామన్ అన్నారు. అంటే ఉద్యోగాలు ఉన్నాయని అర్థమని పేర్కొన్నారు.
4:27 PM
Feb 1, 2023
MSMEలు మహమ్మారి సమయంలో ఇబ్బంది పడ్డాయి. అయితే వారి సెక్యూరిటీలను వారికి 95% తిరిగి ఇచ్చామని సీతారామన్ చెప్పారు.
4:24 PM
Feb 1, 2023
కొత్త పన్నుల విధానంలో తాజా మార్పులను తీసుకువచ్చాము, అది ప్రజలు దానిని ఎంచుకోవలసి ఉంటుందని సీతారామన్ చెప్పారు.
4:24 PM
Feb 1, 2023
ప్రజలు పాత సిస్టమ్ నుంచి కొత్త సిస్టమ్ లోకి మారాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు.
4:22 PM
Feb 1, 2023
భారత్ పారిశ్రామిక విప్లవం వైపు అడుగెస్తోందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
4:21 PM
Feb 1, 2023
ఇది సమతుల్యం గల బడ్జెట్ అని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
4:16 PM
Feb 1, 2023
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం, వన్-టైమ్ కొత్త చిన్న పొదుపు పథకం, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, మార్చి 2025 వరకు రెండేళ్ల కాలానికి అందుబాటులో తీసుకొచ్చాం: నిర్మలా సీతారామన్
4:15 PM
Feb 1, 2023
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్నారు.
3:34 PM
Feb 1, 2023
స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన స్టాక్ మార్కెట్లు అనంతరం చల్లబడ్డాయి. చివరికి సెన్సెక్స్ 158 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయింది.
3:23 PM
Feb 1, 2023
ఈ బడ్జెట్ దేశంలోని ప్రతి రంగానికి, ప్రతి రాష్ట్రానికి సంక్షేమం కోసం ఉద్దేశించిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.
12:50 PM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
ఆదాయపు పన్ను
గరిష్ట పన్ను రేటు -42.74 శాతం ఉండగా సర్‌చార్జ్ రేటును 37శాతం నుంచి 27శాతం వరకు కొత్త పన్ను విధానంలో తగ్గింపు
12:40 PM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
ప్రత్యక్ష పన్ను
వార్షిక ఆదాయం రూ.15 లక్షలకు పైగా ఉంటే 30శాతం పన్ను
12:39 PM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
ఆదాయపు పన్ను శ్లాబులు
ఆదాయపు పన్ను (Income Tax) శ్లాబులు రూ.0-రూ.3లక్షలు: నిల్ రూ.3 లక్షలు-రూ.6లక్షలు: 5 శాతం రూ.6 లక్షలు -రూ.9లక్షలు: 10 శాతం రూ.9 లక్షలు-రూ.12లక్షలు: 15 శాతం రూ.12 లక్షలు - రూ.15 లక్షలు: 20 శాతం రూ.15 లక్షలకు మించి: 30 శాతం
12:28 PM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
ఆదాయపు పన్ను
కొత్త ఆదాయపు పన్ను కింద రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు
12:25 PM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
కస్టమ్ డ్యూటీ
సిగరెట్లపై కస్టమ్ డ్యూటీ పెంపు
12:24 PM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్
మంథ్లీ ఇన్‌కమ్ స్కీమ్ రూ.4.5 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంపు
12:11 PM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
సీనియర్ సిటిజన్ల పొదుపు పథకం రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంపు.
12:08 PM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
నేషనల్ హైడ్రోజన్ మిషన్
నేషనల్ హైడ్రోజన్ మిషన్ కోసం రూ.19,700 కోట్లు. 2030 నాటికి హైడ్రోజన్ ఉత్పత్తిని అయిదు మెట్రిక్ మిలియన్ టన్నులకు పెంపు
12:04 PM
Feb 01,2023
ట్యాక్స్ (పన్ను)
పరోక్ష పన్నులు
పాన్ కార్డ్
కేవైసీ డాక్యుమెంట్లను భద్రపర్చడానికి డిజిలాకర్ వినియోాగానికి ప్రోత్సాహం. పాన్ నంబర్ తో అనుసంధానం
12:02 PM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
విద్య
విద్యా రంగానికి..
దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో చదువుకుంటోన్న 3.5 లక్షల మంది విద్యార్థుల కోసం వచ్చే మూడేళ్లలో 38,800 టీచర్ల నియమాకాలు.
11:59 AM
Feb 01,2023
వేటి ధరలు తగ్గుతాయి , వేటి ధరలు పెరుగుతాయి?
గ్రీన్ ఎనర్జీపై దృష్టి
నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయడంలో భాగంగా గ్రీన్ ఫ్యూయెల్, గ్రీన్ ఎనర్జీ వంటి పథకాల అమలు. ఇవి కార్బన ఉద్గారాలను తగ్గిస్తాయి. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తాయి- నిర్మల సీతారామన్
11:55 AM
Feb 01,2023
వేటి ధరలు తగ్గుతాయి , వేటి ధరలు పెరుగుతాయి?
ఎలక్ట్రిక్ కార్లు/స్కూటర్లు
విద్యుత్
విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతానికి రూ.35,000 కోట్లు. బ్యాటరీ స్టోరేజీ రంగానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్.
11:52 AM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
రైైల్వేస్
రైల్వేలకు ఊతం
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రైల్వేల బలోపేతానికి రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపు.
11:51 AM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
పీఎం మత్స్య సంపద యోజన
రూ.6,000 కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. మత్స్యకారులు, వ్యాపారులు, ఈ రంగంలో కార్యకలాపాలు సాగిస్తోన్న సూక్ష్మ, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు ప్రయోజనాల కోసం ఈ పథకం
11:48 AM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన
ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు 66 శాతం అంటే రూ.79,000 కోట్లు పెంపు
11:44 AM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
మూలధన పెట్టుబడి
వరుసగా మూడో ఏడాది కూడా మూలధన పెట్టుబడిలో 33 శాతం పెంపు. రూ.10 లక్షల కోట్లు. 2019-20 కంటే మూడింతలు పెరిగిన మూలధన పెట్టుబడి
11:42 AM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
పీఎంపీబీటీజీ అభివృద్ధి మిషన్
గిరిజనుల సామాజిక-ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి పీఎంపీబీటీజీ అభివృద్ధి మిషన్ ఏర్పాటు. గిరిజన తండాలు, గూడెంలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే మూడేళ్లలో రూ.15,000 కోట్లు కేటాయింపు
11:39 AM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
ఆరోగ్యం
కొత్త నర్సింగ్ కళాశాలలు
157 వైద్య కళాశాలలను సమన్వయపర్చడానికి 2014 నుంచి 157 కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటు
11:37 AM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
పెరిగిన తలసరి ఆదాయం
2022-2023 ఆర్థిక సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం పెరిగింది. 1.97 లక్షల కోట్లకు చేరింది
11:35 AM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
సప్తర్షి- ఏడు రంగాలకు ప్రాధాన్యత
అమృత కాలంలో 7 రంగాల బలోపేతానికి సప్తర్షి స్కీం. 1. సమ్మిళిత అభివృద్ధి 2. చివరి మైలురాయి వరకు చేరుకోవడం 3. మౌలిక సదుపాయాలు-పెట్టుబడులు 4. వ్యవస్థల బలోపేతం 5. గ్రీన్ గ్రోత్ 6. యువ శక్తి 7. ఆర్థిక రంగం
11:31 AM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజ్
సంప్రదాయపరమైన కళాకారులు, చేతివృత్తులవారిని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్యాకేజీ
11:28 AM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
వ్యవసాయం
వ్యవసాయ రంగం బలోపేతానికి..
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, ఈ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా అగ్రికల్చర్ యాక్సిలేటర్ ఫండ్.
11:26 AM
Feb 01,2023
బడ్జెట్ కేటాయింపులు
ఆర్థిక అజెండా
ఉద్యోగాల కల్పన, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి ఎకనమిక్ అజెండా ఖరారు
10:17 AM
Feb 01,2023
ట్యాక్స్ (పన్ను)
GST
రైల్వేలు, జాతీయ రహదారులపై బడ్జెట్ అంచనాలు
రైల్వేలు, జాతీయ రహదారులకు రూ.4 లక్షల కోట్ల మేర కేటాయింపులు జరగొచ్చు. 2022-23లో ఈ రెండింటికీ కేంద్రం రూ.2 లక్షల కోట్లు మంజూరు చేసింది.
10:14 AM
Feb 01,2023
ట్యాక్స్ (పన్ను)
GST
జనవరిలో భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
జనవరిలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. రూ.1.55 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
10:11 AM
Feb 01,2023
ట్యాక్స్ (పన్ను)
GST
పన్ను శ్లాబుల్లో మార్పులు
కొత్త పన్ను విధానంలో సవరణలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.