వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్లు చెదిరే లెక్కలు.. మోదీ భద్రత కోసం రోజుకు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..

|
Google Oneindia TeluguNews

గతేడాది ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) చట్టాన్ని ఎన్డీయే ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. గతంలో మాజీ ప్రధానులకు,గాంధీ కుటుంబానికి ఇచ్చిన ఎస్పీజీ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. కేవలం ప్రధానికి,ఆయనతో ఉండే కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజీ సెక్యూరిటీని పరిమితం చేసింది. అలాగే మాజీ ప్రధానులకు కూడా పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఐదేళ్ల వరకు మాత్రమే వారి అధికారిక నివాసాల్లో ఎస్‌పీజీ భద్రత ఉంటుందని సవరించిన చట్టంలో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ప్రధాని మోదీకి మాత్రమే ఎస్పీజీ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీజీ భద్రతకు సంబంధించి తాజాగా లోక్‌సభలో చర్చ జరగ్గా.. ఆ ఖర్చు వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఆ వివరాలు వెల్లడించాలన్న డీఎంకె ఎంపీ

ఆ వివరాలు వెల్లడించాలన్న డీఎంకె ఎంపీ


ప్రస్తుతం దేశంలో ఎస్పీజీ కవర్,సీఆర్పీఎఫ్ భద్రత లభిస్తున్న వ్యక్తుల జాబితాను వెల్లడించాలని డీఎంకె ఎంపీ దయానిధి మారన్ కేంద్రాన్ని కోరారు. ఏ ప్రాతిపదికన వారికి సెక్యూరిటీ అందిస్తున్నారో కూడా చెప్పాలన్నారు. దీనికి లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.. కేవలం మోదీ ఒక్కరికే ఎస్పీజీ భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. సీఆర్పీఎఫ్ సెక్యూరిటీని 56 మంది వీఐపీలకు అందిస్తున్నామని చెప్పిన కిషన్ రెడ్డి.. వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.

తాజా బడ్జెట్‌లో ఎస్పీజీ కవర్‌కి రూ.599కోట్లు

తాజా బడ్జెట్‌లో ఎస్పీజీ కవర్‌కి రూ.599కోట్లు


తాజా బడ్జెట్‌లో 3వేల మంది ఎస్పీజీ కమెండోల కోసం రూ.599.55కోట్లు కేటాయించినట్టు చెప్పారు. గతంతో పోలిస్తే ఎస్పీజీకి 10శాతం ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. 2019-20 బడ్జెట్‌లో రూ.540.16కోట్లు ఎస్పీజీకి కేటాయించారు. అప్పుడు ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ,ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ కూడా ఎస్పీజీ కవర్‌లో ఉన్నారు. అంటే అప్పటి ఎస్పీజీ బడ్జెట్ ప్రకారం.. ఒక్కొక్కరి భద్రత కోసం రూ.135కోట్లు ఖర్చు చేశారు. అయితే గతేడాది చట్ట సవరణ తర్వాత గాంధీ కుటుంబాన్ని ఎస్పీజీ కవర్ నుంచి తొలగించారు. ప్రస్తుతం మోదీ మాత్రమే ఎస్పీజీ కవర్‌లో ఉన్నారు. ప్రస్తుత బడ్జెట్‌ను బట్టి చూస్తే పర్ క్యాపిటా దాదాపు 340శాతం పెరిగిందని చెప్పాలి.

 నిమిషానికి రూ.11,263

నిమిషానికి రూ.11,263

ప్రస్తుత బడ్జెట్‌లో రూ.599 కోట్లు ఎస్పీజీ కవర్ కోసం కేటాయించారు. దేశంలో ఎస్పీజీ కవర్ పొందుతున్న ఏకైక వ్యక్తి మోదీ కావడంతో.. ఆయన భద్రత కోసం రోజుకు రూ.1.62కోట్లు ఖర్చు చేస్తున్నట్టు లెక్క. అంటే నిమిషానికి రూ.11263,గంటకు రూ.6.75లక్షలు ఆయన భద్రత కోసం వెచ్చిస్తున్నారు.

Recommended Video

#DelhiElectionResults : BJP Unable To Bag Delhi After 22 Years,Better Luck Next Time!
 ఎస్పీజీ చట్ట సవరణ

ఎస్పీజీ చట్ట సవరణ


గతేడాది ఎస్పీజీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్పీజీ కవర్‌ను తొలగిస్తూ చట్టంలో సవరణలు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం గాంధీ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ కవర్‌ను కొనసాగిస్తూ వచ్చారు. అయితే చట్ట సవరణ ద్వారా వారికి ఎస్పీజీ కవర్‌ను తొలగించి సీఆర్పీఎఫ్ దళాల జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు గత ఆగస్టులో ఎస్పీజీ భద్రతను ఉపసంహరించారు.

English summary
It was a known fact. Law had been amended and notified last year. Yet, a question was asked in Parliament and the home ministry gave a written reply in the Lok Sabha making it official that Prime Minister Narendra Modi is the lone Special Protection Group (SPG) protectee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X