కేంద్ర బడ్జెట్: రాజకీయ పార్టీలకు భారీ షాక్

జైట్లీ బడ్జెట్ రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. పార్టీలకు వచ్చే విరాళాలపై పరిమితులు విధించారు. నగదు రూపంలో స్వీకరించే విరాళాలపై ఆంక్షలు పెట్టారు.

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్‌లో భారీ షాక్ ఇచ్చారు. రాజకీయ పార్టీలు స్వీకరించే విరాళాలపై పరిమితులు విధించారు. పార్టీలు కేవలం 2000 రూపాయల వరకు మాత్రమే నగదు రూపేణా విరాళాలు స్వీకరించడానికి వీలుంటుందని చెప్పారు.

అంతకు మించి మొత్తాలను కచ్చితంగా చెక్కులు లేదా ఆన్‌లైన్ లేదా డిజిటల్ రూపంలో మాత్రమే తీసుకోవాలని, దాతల పేర్లు కూడా వెల్లడించి తీరాలన్నారు. ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ కచ్చితంగా దాఖలు చేయాలని స్పష్టం చేశారు. దీంతో రాజకీయ పార్టీలకు వచ్చే అజ్ఞాత విరాళాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎన్నికల వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Union Budget: Arun Jaitley give shock to politicala parties

చారిటబుల్ ట్రస్టులకు ధన రూపేణా అందించే విరాళం కూడా రూ. 2వేలకు మించరాదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బుధవారం ఆయన పార్లమెంటులో 2017-18 సాధారణ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రూ.3లక్షల కన్నా నగదు చెల్లింపులు వద్దని కమిటీ చెప్పిందని, ఈ దిశగా చట్టం తీసుకొస్తామని జైట్లీ చెప్పారు. అలాగే డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించే పరికరాలు తయారుచేస్తే పన్ను మినహాయింపులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

గ్రామీణ భారతంపై తమ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేయాలనుకుంటున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మౌలిక వసతుల కల్పన, పేదరిక నిర్మూలనే తమ లక్ష్యమన్న ఆయన, నోట్ల రద్దు వల్ల సమకూరిన డబ్బును వీటికి ఖర్చు చేస్తామని చెప్పారు. ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిస్తామంటూ విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+