వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మిషన్ కర్మయోగి’కి మోదీ కేబినెట్ ఆమోదం - సివిల్‌ సర్వీసుల్లో భారీ ప్రక్షాళన

|
Google Oneindia TeluguNews

మిషన్‌ కర్మయోగి పేరిట సివిల్‌ సర్వీసుల ప్రక్షాళనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బుధవారం కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మీడియాకు వివరించారు.

మళ్లీ మావోయిస్టుల అలజడి - ఆసిఫాబాద్ అడవుల్లో డీజీపీ కీలక పర్యటన - గణపతి లొంగుబాటు వేళ..మళ్లీ మావోయిస్టుల అలజడి - ఆసిఫాబాద్ అడవుల్లో డీజీపీ కీలక పర్యటన - గణపతి లొంగుబాటు వేళ..

సివిల్‌ సర్వీసుల సామర్థ్య పెంపు కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్‌ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందని మంత్రి జవదేకర్ చెప్పారు. సివిల్స్ అధికారులు మరింత సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా, చురుకుగా, పారదర్శకంగా పనిచేసేలా వాళ్లను తీర్చిదిద్దే లక్ష్యంతో మిషన్‌ కర్మయోగిని ప్రారంభిస్తున్నామని చెప్పారు. అధికారులు మరింత ఉత్తేజంగా, సాంకేతిక అంశాలపై పట్టు సాధించేలా ఈ కార్యక్రమం ఉపకరిస్తుందన్నారు.

Union Cabinet approves Karmayogi scheme for government officials, a biggest HRD reform

ప్రపంచంలో అత్యంత మెరుగైన విధానాలను అవలంభించడంతోపాటు భారత సంస్కృతి, విధానాలకు అనుగుణంగానూ అధికారులు తమ విధానాలను మెరుగుపర్చుకునేందుకు మిషన్ కర్మయోగి ఉపకరిస్తుందని జవదేకర్ అన్నారు.

మిషన్ కర్మయోగితోపాటు జమ్ముకశ్మీర్‌ అధికార భాషల బిల్లును కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. జమ్మూకాశ్మీర్ లో అధికార భాషలుగా ఉర్దూ, కశ్మీర్‌, డోగ్రీ, హిందీ, ఇంగ్లీష్‌ భాషలుగా ఉండనున్నాయి. మరోవైపు జపాన్, ఫిన్‌లాండ్‌, డెన్మార్క్‌లతో వరుసగా జౌళి శాఖ, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖల ప్రతిపాదిత మూడు ఎంఓయూలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని మంత్రి జవదేకర్ తెలిపారు.

మావోయిస్టు పార్టీలో మరో సంచలనం - గణపతి బాటలో మల్లోజుల వేణుగోపాల్‌ లొంగుబాటు? - తెలంగాణ సేఫ్!మావోయిస్టు పార్టీలో మరో సంచలనం - గణపతి బాటలో మల్లోజుల వేణుగోపాల్‌ లొంగుబాటు? - తెలంగాణ సేఫ్!

English summary
After approving setting up of a National Recruitment Agency (NRA), Union Cabinet has today approved the Mission Karmayogi, which it says, is a scheme for bringing post-recruitment reforms in Civil Services. At a media briefing today, Union Minister Prakash Javadekar said this scheme will give an opportunity to government employees to improve their performance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X