వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదానీ చేతికి మరో మూడు ఎయిర్‌పోర్టులు - చెరుకు ధర, డిస్కంలపైనా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

|
Google Oneindia TeluguNews

ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుతోపాటు ఎయిర్ పోర్టుల అభివృద్ధి, చెరుకు ధర, డిస్కంలకు సంబంధించిన వ్యవహారాలపైనా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఎయిర్‌పోర్టులను లీజుకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ మూడు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిని చేసేందుకు కేంద్రప్రభుత్వం.. డెవలపర్‌గా అదానీ గ్రూప్‌ను ఎంపిక చేసింది.

ఇప్పటికే లక్నో, అహ్మదాబాద్. మంగళూరు ఎయిర్ పోర్టులను నిర్వహిస్తోన్న అదానీ గ్రపు చేతికి కొత్తగా మరో మూడు (జైపూర్, తిరువనంతపురం, గౌహతి) ఎయిర్ పోర్టులు దక్కినట్లయింది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు చెందిన ఈ విమానాశ్రయాలను అదానీ గ్రూపునకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వానికి రూ.1070కోట్ల ఆదాయం సమకూరుతుందని మంత్రి జవదేకర్ తెలిపారు. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష- నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ- కేంద్ర కేబినెట్ ఆమోదంఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష- నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ- కేంద్ర కేబినెట్ ఆమోదం

Union Cabinet approves leasing of Jaipur, Guwahati and Thiruvananthapuram airports

ఉజ్వాల్ డిస్కామ్ అష్యూరెన్స్ యోజన కింద గతేడాది సమకూరిన ఆదాయంలో 25 శాతం మూలధనం పరిమితికి మించి డిస్కామ్‌లకు రుణాలను పొడిగించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్‌కు ఒకసారికి వర్తించే సడలింపునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆయా సంస్థలు ఇక ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే అవకాశం ఏర్పడింది.

వ్యాక్సిన్ వికటించి పుతిన్ కూతురు మృతి? రష్యా తయారీ 'స్పుత్నిక్-వీ' సేఫ్ కాదా? అసలు నిజం ఏంటంటే..వ్యాక్సిన్ వికటించి పుతిన్ కూతురు మృతి? రష్యా తయారీ 'స్పుత్నిక్-వీ' సేఫ్ కాదా? అసలు నిజం ఏంటంటే..

ఇక, వ్యవసాయం రంగానికి సంబంధించి.. 2020-21 చక్కెర సీజన్‌లో చెరకు రైతులకు చక్కెర మిల్లులు చెల్లించాల్సిన ధరను కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. పది శాతం ప్రాథమిక రికవరీ రేటుకు అనుగుణంగా క్వింటాల్‌కు రూ.285 చెల్లించే ప్రతిపాదినకు మోదీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ విలేకరులకు తెలిపారు.

English summary
The Union Cabinet on Wednesday approved the proposal for leasing out airports at Jaipur, Guwahati and Thiruvananthapuram through public-private partnership (PPP). and also agrees for Fair and Remunerative Price of sugarcane payable by sugar mills for the sugar season 2020-21
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X