వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌కు కేబినెట్ ఆమోదం: ఎన్పీఆర్ అంటే ఏంటీ? పశ్చిమబెంగాల్, కేరళ నో!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్)కు మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వచ్చే ఏడాది (2020) ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ జాతీయ జనాభా రిజిస్టర్ జరుగుతుందని విశ్వసనీయ సమాచారం.

పౌరసత్వ మంట: ఎమర్సెన్సీ..: కేంద్ర హోం శాఖ అత్యవసర సమావేశం?పౌరసత్వ మంట: ఎమర్సెన్సీ..: కేంద్ర హోం శాఖ అత్యవసర సమావేశం?

ఎన్‌పీఆర్ అంటే..

ఎన్‌పీఆర్ అంటే..

ఎన్‌పీఆర్ అంటే భారతదేశంలో నివాసం ఉండే ప్రజల జాబితానే. ఇది గ్రామాల్లో లేదా చిన్న పట్టణాలు, ఉప జిల్లాలు, జిల్లాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జనాభా నమోదు జరుగుతుంది. పౌరసత్వ చట్టం 1995, ఈ పౌరసత్వం(పౌరుల రిజిస్ట్రేసన్, నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ జారీ కోసం) కింద ఒక వ్యక్తి ఆరు నెలల కంటే ఎక్కువగా ఒక చోట ఉంటున్నాడనే విషయం, మరో 6 నెలలు కంటే ఎక్కువ కాలం అక్కడే ఉంటాడనే విషయాలను ఈ జనాభా నమోదు ప్రక్రియలో సేకరిస్తారు. జాతీయ గుర్తింపు కార్డు కోసం ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్క పౌరుడు కూడా నమోదు చేసుకోవడం తప్పనిసరి.

గుర్తింపు ఇవ్వడం కోసమే..

గుర్తింపు ఇవ్వడం కోసమే..

ఇప్పటికే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కోసం కేంద్ర కేబినెట్ బడ్జెట్ కేటాయించింది. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి దాదాపు రూ. 8,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ జాతీయ జనాభా నమోదు కార్యక్రమం జరుగుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికి కూడా గుర్తింపును ఇవ్వడం కోసమే ఈ జాతీయ జనాభా నమోదు కార్యక్రమం కేంద్రం నిర్వహిస్తోంది.

2010లో కూడా..

2010లో కూడా..


2010లో కూడా జాతీయ జనాభా నమోదు కార్యక్రమం జరిగింది. 2011 జనాభా లెక్కలతోపాటు ఈ పక్రియను కూడా పూర్తి చేశారు. 2015లో ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలను సేకరించడం జరిగింది. ఈ డేటా డిజిలైజేషన్ కూడా పూర్తయిపోయింది.

నో చెప్పిన పశ్చిమబెంగాల్, కేరళ

నో చెప్పిన పశ్చిమబెంగాల్, కేరళ

కాగా, జాతీయ జనాభా నమోదు(ఎన్పీఆర్) కార్యక్రమాన్ని పశ్చిమబెంగాల్, కేరళలో జరపబోమని ఇప్పటికే ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, పినరయి విజయన్ ప్రకటించారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జాతీయ జనాభా నమోదు పక్రియను పశ్చిమబెంగాల్‌లో నిలిపివేయాలంటూ సీఎం మమతా బెనర్జీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఓవైపు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఎన్ఆర్పీకి ఆమోద ముద్ర వేయడం మరోసారి చర్చనీయంశంగా మారింది.

English summary
Union Cabinet approves National population register, Earlier Kerala and WB blocked it
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X