వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష- నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ- కేంద్ర కేబినెట్ ఆమోదం

|
Google Oneindia TeluguNews

కార్మికులు, కూలీలు కాకుండా.. నెలనెలా ఠంచనుగా జీతాలు పొందే సుమారు 50 లక్షల మంది కరోనా లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం వినూత్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒకే పరీక్ష (కామన్‌ ఎలిజిబిలిటీ టెస్టు) నిర్వహించేందు కోసం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్రం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన భేటీలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను మంత్రి జవదేకర్ మీడియాకు వెల్లడించారు.

వ్యాక్సిన్ వికటించి పుతిన్ కూతురు మృతి? రష్యా తయారీ 'స్పుత్నిక్-వీ' సేఫ్ కాదా? అసలు నిజం ఏంటంటే..వ్యాక్సిన్ వికటించి పుతిన్ కూతురు మృతి? రష్యా తయారీ 'స్పుత్నిక్-వీ' సేఫ్ కాదా? అసలు నిజం ఏంటంటే..

చరిత్రలో మైలురాయి..

చరిత్రలో మైలురాయి..

నిజానికి ఎన్ఆర్ఏ ప్రతిపాదనను గత బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దానికిప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఏజెన్సీ ఏర్పాటు కార్యరూపం దాల్చనుంది. నియామకాల కోసం ఏజెన్సీ ఏర్పాటు.. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మైలురాయి లాంటిదని మంత్రి ప్రకాష్ జవదేకర్ అభివర్ణించారు. ఉద్యోగాల కల్పనకు చేపట్టిన సంస్కరణలలో ఇది అతి ముఖ్యమైన అడుగని, దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఎన్ఆర్ఏతో లాభమేంటి?

ఎన్ఆర్ఏతో లాభమేంటి?

మన దేశంలో ప్రతి ఏటా సుమారు 1.25 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలవుతుంటాయి. సుమారు 2.5 కోట్ల మంది అభ్యర్థులు వివిధ పరీక్షలకు హాజరవుతుంటారు. ఐతే వేర్వేరు శాఖలు ఆయా పోస్టుల కోసం విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు కూడా బోలెడు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఈ విధానానికి స్వస్తి పలుకుతూ.. ఉద్యోగాల భర్తీ కోసం కామన్‌ ఎలిజిబిలిటీ టెస్టు నిర్వహించాలని, అందుకోసం నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) ఏర్పాటు చేయాలని కేంద్రం డిసైడైంది. తద్వారా రైల్వే, ఎన్జీసీ, ఎన్టీపీసీ, ప్రభుత్వరంగ బ్యాంకులు తదితర రంగాల్లో.. నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు కోరే అభ్యర్థులు వేర్వేరుగా పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు.

రామ్ పోతినేనికి వైసీపీ బెదిరింపులు - కుల కరోనాపైనా చంద్రబాబు - రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్రామ్ పోతినేనికి వైసీపీ బెదిరింపులు - కుల కరోనాపైనా చంద్రబాబు - రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్

మూడేళ్ల వరకు మెరిట్ చెల్లుబాటు..

మూడేళ్ల వరకు మెరిట్ చెల్లుబాటు..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎన్ఆర్ఏ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ) మెరిట్ జాబితా మూడేండ్ల వరకు చెల్లుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆ గడువు వరకు అభ్యర్థుల సామర్థ్యం, ప్రతిభ మేరకు పలు ప్రభుత్వ రంగాల్లోని ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ విధానంలో నియామకం, ఎంపిక, ఉద్యోగాల ఖరారు వంటివి ఇకపై చాలా సులువుగా జరుగుతాయని, తద్వారా చాలా వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు.

ఒకే గొడుకు కిందకు 20కిపైగా..

ఒకే గొడుకు కిందకు 20కిపైగా..

దేశంలో సుమారు 20కిపైగా నియామక సంస్థలు ఉన్నాయని, అందులో మూడు సంస్థలు మాత్రమే ఇప్పటి వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయని, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుతో ఆ 20పైగా సంస్థలన్నీ ఒక గొడుగు కిందకు వస్తాయని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సీ చంద్రమౌళి తెలిపారు. అతి త్వరలోనే విధివిధానాలు రూపొందిస్తామని, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తదుపరి వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు.

English summary
Union Cabinet on Wednesday approve a proposal to set up National Recruitment Agency that will conduct Common Eligibility Test (CET) for selection to non-gazetted posts in the central government and public sector banks. Union Minister Prakash Javadekar has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X