వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేబర్ సేప్టీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం, 400 మిలియన్ కార్మికులకు ప్రయోజనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కార్మికుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని చెబుతున్న ఎన్డీఏ సర్కార్ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల కార్మికులకు కనీస వేతనాన్ని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరోసారి సమావేశమైన కేంద్ర మంత్రివర్గం .. పనిచేసే చోట కార్మికుల భద్రతకు సంబంధించి కీ డిషిషన్ తీసుకుంది. కార్మిక చట్టాలు సంక్లిష్టంగా ఉన్నాయని .. వాటిని సరళికరించి మార్పులు చేస్తున్నామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు.

భద్రతకు పెద్దపీట
పనిచేసే చోట కార్మికులకు వేధింపుల పర్వంపై కేంద్రం దృష్టిసారించింది. అంతేకాదు కార్మికుల భద్రత ప్రథమమని స్పష్టంచేసింది. సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికుల భద్రతకు ఆయా కంపెనీలు/సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేసింది. దీనికి సంబంధించిన నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీంతో మొత్తం 400 మిలియన్ల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఇప్పటికే కార్మికుల వేతనం కోసం గతవారం కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పనిచేసే వారికి నిర్దేశిత రుసుం చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది. తర్వాత రెండో కీలక నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం తీసుకుంది.

Union Cabinet okays labour safety code that will benefit 400 million workers

సరళతరం
దేశంలోని కార్మిక చట్టాలు సంక్లిష్టంగా ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వాటిని సరళికరించి మార్పులు చేస్తున్నట్టు వివరించారు. ప్రధానంగా వేతనం, కంపెనీలతో సంబంధాలు, సామాజిక భద్రతకు సంబంధించి క్లిష్టంగా నిబంధనలు ఉన్నాయని గుర్తుచేశారు. వాటిని క్రమంగా సరళికరించి .. కార్మికులకు తోడ్పాటును అందిస్తున్నామని పేర్కొన్నారు. పనిచేసే చోట ఉపాధితోపాటు, భద్రత, ఆరోగ్యం, పనిచేసే చోట పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాలకు కూడా ప్రయారిటీ ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు.
English summary
The Union cabinet on Wednesday approved the labour safety code that will benefit 400 million workers in organized and unorganised sectors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X