వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఎయిరిండియా భద్రతా నిబంధనలు భేష్, ఎంపి ఇలా దొరుకుతాడనుకోలేదు'

ఎయిరిండియాలో భద్రతా నిబంధనలు చాలా బాగున్నాయని కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆశోక్ గజపతిరాజు చెప్పారు.అయితే ఎయిరిండియా సిబ్బందిని కొడుతూ ఓ ఎంపి దొరుకుతాడని తాను కలలో కూడ ఊహించలేదన్నారు మంత్రి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎయిరిండియాలో భద్రతా నిబంధనలు చాలా బాగున్నాయని కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆశోక్ గజపతిరాజు చెప్పారు.అయితే ఎయిరిండియా సిబ్బందిని కొడుతూ ఓ ఎంపి దొరుకుతాడని తాను కలలో కూడ ఊహించలేదన్నారు మంత్రి.

శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ ఇండియన్ ఎయిర్ లైసెన్స్ విమానంలో సిబ్బందిని 25 సార్లు చెప్పుతో కొట్టడం వివాదానికి కారణమైంది.అయితే రవీంద్ర గైక్వాడ్ ను ఎయిరిండియాతో పాటు ఇతర విమాన సంస్థలు కూడ తమ విమానాల్లో ఆయనను ప్రయాణించకుండా ట్రావెల్ బ్యాన్ ను విధించాయి.

union civil aviation minister ashok gajapati raju response on shiv sena mp ravindra gaikwai issue in loksabha

శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ వ్యవహరంపై లోక్ సభ, రాజ్యసభలో చర్చ జరిగింది.ఈ విషయమై ఆశోక్ గజపతి రాజు మాట్లాడారు. కమెడియన్ కపిల్ శర్మ కూడ మద్యం సేవించి విమానంలో గొడవ చేశాడని అయితే అతడిపై నిషేధం ఎందుకు విధించలేదని శివసేన ఎంపీ ఆనందరావు అడ్సుల్ ప్రశ్నించారు.

నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని లోక్ సభలో మంత్రి ఆశోక్ గజపతిరాజు చెప్పారు. శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ ను నిషేధించడం ద్వారా విమానాయాన సంస్థలు తమ దాదాగిరిని చూపుతున్నాయని సమాజ్ వాదీ పార్టీ ఎంపి నరేష్ అగర్వాల్ రాజ్యసభలో అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పలు పార్టీలకు చెందిన ఎంపిలు రవీంద్రగైక్వాడ్ కు మద్దతుగా నిలిచి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

English summary
Days after Shiv Sena MP Ravindra Gaikwad allegedly assaulted an Air India employee, Civil Aviation Minister Ashok Gajapathi Raju, speaking in the Lok Sabha on Monday, said the state owned airliner cannot discriminate between different classes and that they cannot compromise on safety. “Violence of any kind is a disaster in civil aviation. We have a good safety record, did not expect in the wildest of dreams an MP would be caught doing this,” he said. “
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X