హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రాలకు నిధుల కోతలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

''తెలంగాణ నుంచి కేంద్రానికి ఏటా 2.72 లక్షల కోట్లు పన్నుల రూపంలో వెళితే... తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం 1.12లక్షల కోట్లే. ప్రస్తుత మోదీ సర్కార్ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని రాష్ట్రాలపై, ప్రధానంగా తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది''అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందన్న వైసీపీ నేతల మాటలు కూడా తాను విన్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్రాలకు నిధుల కోతలపై నెలకొన్న గందరగోళంపై ఆమె వివరణ ఇచ్చారు.

పారిశ్రామిక వర్గాల్లో గందరగోళం..

పారిశ్రామిక వర్గాల్లో గందరగోళం..

ఈ నెల 1న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై పారిశ్రామిక, ఆర్థిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం వ్యక్తం చేసిన నేపథ్యంలో బడ్జెట్ పై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశవ్యాప్త పర్యటన చేపట్టారు. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ లో పారిశ్రామిక, వ్యాపార వర్గాలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘ఆర్థిక జవాబుదారీతనం - బడ్జెట్‌ నిర్వహణ' (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టానికి అనుగుణంగానే కేంద్ర బడ్జెట్ రూపొందిందని, ఆర్థిక క్రమ శిక్షణ పాటించాలన్నదే బీజేపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, బడ్జెట్ పై లేనిపోని అనుమానాలు అవసరంలేదని మంత్రి భరోసా ఇచ్చారు.

జీఎస్టీ వసూళ్లు తగ్గాయి..

జీఎస్టీ వసూళ్లు తగ్గాయి..

దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు తగ్గిన మాట వాస్తవమని, అందుకే రాష్ట్రాలకు ఆ నిధులు ఇవ్వలేకపోయామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల అంగీకరించారు. అయితే వసూళ్లు పోగయ్యేకొద్దీ ఆ మేరకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. జీఎస్టీ మినహా.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులేవీ తగ్గలేదని, ఏ ఒక్క రాష్ట్రాన్నీ కేంద్రం చిన్నచూపు చూడబోదన్నారు. బడ్జెట్ పై పారిశ్రామిక వర్గాలకు అవగాహన కల్పించేందుకు ఒక్కో సిటీకి వెళతానన్న ఆమె.. సోమవారం బెంగళూరులో పర్యటించనున్నట్లు తెలిపారు. తెలంగాణను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ..

 కేటీఆర్‌కు కౌంటర్

కేటీఆర్‌కు కౌంటర్


రాష్ట్రాల నుంచి కేంద్రానికి అందే నిధుల విషయంలో తెలంగాణ కాంట్రిబ్యూషన్ చాలా బాగుందని మంత్రి నిర్మల కితాబిచ్చారు. అయితే కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కోతలు పెట్టామన్నది మాత్రం అవాస్తవమని, దీనిపై ఇటీవలే మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లు తన దృష్టికి వచ్చాయని ఆమె చెప్పారు. తెలంగాణకు కేంద్రం రూ.4వేల కోట్లు ఇవ్వాల్సి ఉందనడం అవాస్తవమని, జీఎస్టీ కలెక్షన్లు తగ్గడం వల్ల దానికి సంబంధించిన నిధుల్ని మాత్రమే అన్ని రాష్ట్రాలకూ నిలిపేశామని వివరణ ఇచ్చారు. రాష్ట్రాలకు కేంద్రం సరిగా సహకరించడంలేదన్న కేటీఆర్ వ్యాఖ్యలను నిర్మల ఖండించారు.

అసలు కేటీఆర్ ఏమన్నారంటే..

అసలు కేటీఆర్ ఏమన్నారంటే..

గతవారం ఢిల్లీలో టైమ్స్ నౌ సదస్సులో పాల్గొన్న తెంగాణ మంత్రి కేటీఆర్.. ‘దేశ నిర్మాణంలో రాష్ట్రాల పాత్ర' అనే అంశంపై మాట్లాడుతూ.. దేశ పురోగతికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగుండటం చాలా అవసరమని, అయితే ప్రస్తుత మోదీ సర్కారు ఆ ప్రాధాన్యతను గుర్తించడంలేదని, కేంద్రం తీసుకునే నిర్ణయాల ప్రభావం రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో, అసలు ఆయా రాష్ట్రాల్లో జరుగుతోన్న పరిణామాలేంటో కేంద్రానికి సోయి లేకుండా పోయిందని, తెలంగానపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసిన పెద్ద నోట్ల రద్దును గతంలో సమర్థించినందుకు టీఆర్ఎస్ చాలా చింతిస్తున్నదనీ కేటీఆర్ చెప్పారు.

English summary
union finance minister nirmala sitharaman said that center did not decreased funds to any state including telangana. she interacted with industrial and economic sector representatives in hyderabad on sunday to clarify doubts on budget
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X