వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ జగన్, కేసీఆర్‌లపై జాయింట్‌గా: నిర్మలమ్మ కనికరం: పంచాయతీలకు భారీగా నిధులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలాన్ని రేపుతోంది. ఈ మహమ్మారి తీవ్రత రోజురోజుకూ మరింత తీవ్రతరమౌతోందే తప్ప.. ఎక్కడేగానీ తగ్గేలా కనిపించట్లేదు. గ్రామాలు సైతం దీనికి మినహాయింపు కాదు. పల్లెల్లోనూ వైరస్ విజృంభణ నిరంతరాయంగా కొనసాగుతోంది. దీన్ని ఎదుర్కొనడానికి గ్రామాలకు ఆర్థిక పరిపుష్ఠిని కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశంలో 25 రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీలకు భారీగా నిధులను కేటాయించింది. దీని విలువ 8,923.80 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్స్ ఈ మొత్తాన్ని విడుదల చేసింది.

సొంత పార్టీ నేతకు కమలం హ్యాండ్: సీఎంగా హిమంత: బీజేఎల్పీ నేతగా ఎన్నిక: సాయంత్రమేసొంత పార్టీ నేతకు కమలం హ్యాండ్: సీఎంగా హిమంత: బీజేఎల్పీ నేతగా ఎన్నిక: సాయంత్రమే

ఈ నిధులను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు కేటాయించాల్సి ఉంటుంది. గ్రామీణ స్థాయిలో కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కోవిడ్ ప్రొటోకాల్స్‌ను అమలు చేయడంపై వినియోగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించింది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి యునైటెడ్ గ్రాంట్స్‌గా ఈ మొత్తాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

Union govt released Rs 8,923.8 cr to 25 States for providing grants to the Gram Panchayats

15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు- యునైటెడ్ గ్రాంట్స్ మొత్తం తొలి విడతను సాధారణంగా జూన్‌లో విడుదల చేస్తుంటుంది ఈ శాఖ. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పంచాయతీ రాజ్ విజ్ఞప్తి మేరకు అడ్వాన్స్‌గా విడుదల చేసింది. కరోనా సంక్షోభ సమయంలో పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ నిధులను కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వాలకు ఊరట కలిగించినట్టయింది.

Recommended Video

2-DG | How It Works On Human Cells And Fights Covid-19 || Oneindia Telugu

ఏపీలోని గ్రామ పంచాయతీల కోసం 387.3 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. తెలంగాణ కోసం 273 కోట్ల రూపాయలను ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్-రూ.34 కోట్లు, అస్సాం-237.2, బిహార్-741.8, ఛత్తీస్‌గఢ్-215, గుజరాత్-472.4, హర్యానా-187, హిమాచల్ ప్రదేశ్-63.4, జార్ఖండ్-249.8, కర్ణాటక-475.4, కేరళ-240.6, మధ్యప్రదేశ్-588.8, మహారాష్ట్ర-816.4, మణిపూర్-26.2, మిజోరం-13.8, ఒడిశా-333.8, పంజాబ్-205.2, రాజస్థాన్-570.8, సిక్కిం-6.2, తమిళనాడు-533.2, త్రిపుర-28.2, ఉత్తర ప్రదేశ్-1441.6, ఉత్తరాఖండ్-85, పశ్చిమ బెంగాల్-652.2 కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

English summary
The Union Ministry of Finance has released funds to a total of 25 states in the country. Which has released a total of Rs 8,923.80 crore, has directed the Gram Panchayats to spend. Two Telugu states are on the list of states that would receive funds. Andhra Pradesh to Rs. 387.8 crore and Telangana Rs. 273 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X