వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya verdict: అయోధ్యపై తీర్పు కంటే ముందే ఆసక్తి రేపుతున్న అమిత్ షా కీలక భేటీ: అజిత్ ధోవల్..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చారిత్రాత్మక అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై మరి కాస్సేపట్లో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించబోతున్న నేపథ్యంలో.. అందరి దృష్టినీ తన వైపు మరల్చుకున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఏకంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో సమావేశం అయ్యారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో అధినేత అరవింద్ కుమార్ సహా హోం మంత్రిత్వ శాఖకు చెందిన కీలక అధికారులు దీనికి హాజరయ్యారు. దేశ రాజధానిలో తన అధికారిక నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. జాతీయ భద్రతా సలహదారు, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తో ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తి రేపుతోంది.

Ayodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపుAyodhya Verdict: 134ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర...మలుపులు, తీర్పులు..నేటితో ముగింపు

తీర్పు తరువారి పరిస్థితులపై ఆరా..

రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించడానికి రెండు గంటల ముందే ఈ భేటీ ఏర్పాటైంది. అయోధ్యపై తీర్పు వెలువడిన అనంతరం చోటు చేసుకునే పరిణామాలపై ఆరా తీయడానికే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అజిత్ ధోవల్ భేటీ కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. సాధారణంగా- హోం మంత్రిత్వ శాఖ అధికారులు ఇలాంటి కీలక సమయాల్లో ఇంటెలిజెన్స్ బ్యురో చీఫ్ తో భేటీ నిర్వహిస్తుంటారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై మూడో కంటికి తెలియకుండా సమగ్ర వివరాలను సేకరించే బాధ్యత ఇంటెలిజెన్స్ బ్యూరోదే.

Union Home Minister Amit Shah calls a meeting of party spokespersons at his residence

పవర్ పాయింట్ ప్రజంటేషన్..

తీర్పు వెలువడిన అనంతరం ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయి? వాటిని అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టారనే అంశంపై ఇంటెలిజెన్స్ చీఫ్ అరవింద్ కుమార్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను ఇస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్ని కీలకమైన ఫొటోలు, ఇతరత్రా సమాచారాన్ని వారు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తున్నారని చెబుతున్నారు. ప్రత్యేకించి- ఉత్తర్ ప్రదేశ్ సహా కొన్ని ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే చేపట్టిన భద్రతాపరమైన చర్యలపై ఫొటోలతో సహా వివరిస్తున్నారని సమాచారం.

English summary
Home Minister Amit Shah calls a high level security meeting at his residence. National Security Advisor (NSA) Ajit Doval, Intelligence Bureau (IB) Chief, Arvind Kumar, and other senior officials to attend the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X