వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైరల్ : ఈ వీడియో చూస్తే తేనెపై విరక్తి కలగడం ఖాయం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఈ వీడియో చూస్తే తేనెపై విరక్తి కలగడం ఖాయం

నాగాలాండ్ : తేనె అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తేనెలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు తేనెను తాగుతారు. అయితే కేంద్రమంత్రి కిరణ్ రిజిజూ ఒక వీడియోను ట్విటర్ ద్వారా పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారు తేనె అంటేనే అదోలా ఫీలవుతున్నారు. సాధారణంగా తేనెను ఎక్కడ ఉండటాన్ని గమనిస్తాం..? ఏ చెట్టుపైనో లేక ఏ గోడకో తేనె తట్టు ఉంటుంది. కానీ కేంద్రమంత్రి కిరణ్ రిజుజూ పోస్టు చేసిన వీడియోలో మాత్రం ఓ మనిషి సీటుకు తేనెటీగలు తట్టును ఏర్పాటు చేశాయి.

ఈశాన్య రాష్ట్రాల్లో దట్టమైన అడవులు ఉంటాయి. ఏ చెట్టు చూసిన తేనెతట్టులే దర్శనమిస్తాయి. ఇక అక్కడి చెట్లతో పాటు నాగాలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి వెనక సీటుపై కూడా తేనె తట్టు కనిపిస్తుంది. ఇదే వీడియోను కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజూ పోస్టు చేశారు. అసాధరణ చోట తేనె తట్టు ఉందంటూ రిజిజూ ట్వీట్ చేశారు. కిరణ్ రిజిజూ వీడియో పోస్టు చేయగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజెన్లు తమకు తోచినట్లు కామెంట్స్ పోస్టు చేశారు. అసలు ఆ వ్యక్తి వేసుకున్న ప్యాంటుపైకి తేనెటీగలు ఎలా వచ్చాయి...? అని కొందరు ప్రశ్నించగా.. అసలు ప్యాంటు ఎలా వేసుకుంటున్నాడని మరికొందరు ప్రశ్నించారు.

Union Minister Kiren Rijiju Shares a video of honey bees on man pants,goes viral

ఇక కిరణ్ రిజిజూ పోస్టు చేసిన వీడియోకు అనేక లైక్లు వచ్చాయి. ప్రముఖ భారత షట్లర్ గుత్తా జ్వాలా కూడా రియాక్ట్ అయ్యారు. జీన్స్ కాబట్టి వ్యక్తి బతికిపోయాడని సాధారణ ప్యాంట్ కనుక ధరించినట్లయితే పరిస్థితి మరోలా ఉండేదని ఓ నెటిజెన్ ట్వీట్ చేశాడు. కొందరు మాత్రం ప్యాంట్ ధరించిన వ్యక్తిపై జాలి చూపారు. ఇక తేనెటీగల పెంపకంలో నాగాలాండ్ రాష్ట్రం ముందంజలో ఉంది.

English summary
India’s sports minister Kiren Rijiju shared a video of a beehive in a very unusual location and the tweet has since gone viral. The video – that the minister said was was shot in Nagaland,shows a swarm of bees on the derriere, and extending till the groin, of a man’s denim pants.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X