• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్ర మంత్రిని బలి తీసుకున్న కరోనా - రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి కన్నుమూత

|

దేశంలో కరోనా రక్కసి కరతాళనృత్యం చేస్తున్నది. మొత్తం మరణాల సంఖ్య లక్షకు చేరువ అవుతోన్న వేళ సాక్ష్యాత్తూ ఓ కేంద్ర మంత్రి వైరస్ కాటుకు బలికావడం కలకలం రేపుతున్నది. రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగడి(65) బుధరవాంకన్నుమూశారు. రెండు వారాల కిందట పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందారు. కర్ణాటకలోని బెలగాం లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా సురేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కరోనాపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు - ఏడు రాష్ట్రాల సీఎంలకు నిర్దేశం - తిరుమల నుంచే జగన్ హాజరు

తొలి కేంద్ర మంత్రి..

తొలి కేంద్ర మంత్రి..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు విధిగా టెస్టులు చేయించుకోవాలనే నిబంధన ఉండటంతో ఈనెల 11న కేంద్ర మంత్రి సురేశ్ అంగడి టెస్టులు చేయించుకోగా, పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తనకు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరానని ట్విటర్ లో వెల్లడించిన ఆయన.. త్వరలోనే కోలుకుంటానని ఆశభావం వ్యక్తం చేశారు. కానీ రెండు వారాల చికిత్సలో పురోగతి లేకపోగా, ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. చివరికి బుధవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. దేశంలో కరోనాతో చనిపోయిన తొలి కేంద్ర మంత్రి సురేశే కావడం విచారకరం. కొద్ది రోజుల కిందట కర్ణాటక బీజేపీ రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ, తమిళనాడు కాంగ్రెస్ కన్యాకుమారి ఎంపీ వసంతకుమార్ కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

ప్రధాని మోదీ, ప్రముఖుల విచారం..

ప్రధాని మోదీ, ప్రముఖుల విచారం..

రైల్వే మంత్రి సురేశ్ అంగడి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సురేశ్ అంకితభావం, సమర్థత ఉన్న మంత్రి అని, తాను పనిచేసిన అన్ని రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్నారని మోదీ గుర్తుచేశారు. ఈ కష్టసమయంలో అంగడి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు. సహచరుడి మరణంపై కేంద్ర మంత్రులు అందరూ విచారం వ్యక్తం చేశారు. బీజేపీ సహా అన్ని పార్టీల ఎంపీలూ తమ సంతాపాలను తెలిపారు.

చైనా వైరస్ వల్లే సర్వనాశనం - డ్రాగన్‌పై చర్యలకు ట్రంప్ డిమాండ్ - ఐరాసలో స్పీచ్ - WHOపైనా ఫైర్

ఇదీ సురేశ్ అంగడి నేపథ్యం..

ఇదీ సురేశ్ అంగడి నేపథ్యం..

నాలుగు సార్లు ఎంపీగా గెలుపొందిన సురేశ్ అంగడి.. కర్ణాటకలో బీజేపీని బలంగా నిలబెట్టిన ప్రముఖుల్లో ఒకరు. 155, జూన్ 1 బెల్గాంలో ఆయన జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు సోమవ్వ, చెన్నబసప్ప. 1996-99 మధ్య బీజేపీ బెల్గాం జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 200-2004 మధ్య బెల్గాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడిగా కొనసాగారు. 2004లో తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా మరో మూడు సార్లూ విజయం సాధించారు. 2019 విజయం తర్వాత ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించింది.

English summary
Union Minister of State for Railways Suresh Angadi passed away on Wednesday. Earlier this month he was admitted to AIIMS in Delhi after he contracted coronavirus disease. Following his swab samples returning positive for COVID-19 on September 11, the MP from Belagavi had requested all those who came in close contact with him me in the last few days to monitor their health and get tested in case of any symptoms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X