• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూతురికి అలా జరిగినా సీఎంకు తెలిసిరాలేదు.. మా వల్లే బతికిపోయారు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

|

''తెలంగాణకు సంబంధించి ఇవాళ(ఫిబ్రవరి 18) చాలా కీలకమైన రోజు. ఆరేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు ఏపీ విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించింది కాబట్టే ప్రజలు ఆదరిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అత్యంత వేగంగా, బలంగా పుంజుకుంటోంది. లోక్ సభ, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం.

కన్నకూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయినాసరే సీఎం కేసీఆర్ కు బీజేపీ సత్తా పెరిగిందని తెలిసిరాలేదు. ఇంకా కారు కూతలు కూస్తున్నారు. నిజం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం వల్లే తెలంగాణ కొంతైనా అభివృద్ధి చెందింది'' అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం చర్లపల్లి రైల్వే స్టేషన్ లో కొత్త వసతుల్ని ప్రారంభించిన ఆయన.. సికింద్రాబాద్ లోని టైమ్ స్క్వేర్ హోటల్ లో మీడియాతో మీడియాతో మాట్లాడారు.

కేటీఆర్‌పై ఫైర్.. మా వల్లే..

కేటీఆర్‌పై ఫైర్.. మా వల్లే..

ఢిల్లీకి ఎక్కువ నిధులు పంపే తెలంగాణను కూడా కేంద్రం చిన్నచూపు చూస్తోందని, రాష్ట్రాలకు మెహర్బానీ చేసినట్లుగా మోదీ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శలు చేసిన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి గోయల్ మండిపడ్డారు. గడిచిన ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టబట్టే తెలంగాణ కొంచెమైనా అభివృద్ధి చెందిందని, బీజేపీ సహకారం వల్లే రాష్ట్రం బతికిపోయిందని గోయల్ చెప్పారు. కేటీఆర్ తన కామెంట్లతో అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు.

రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి రూ.2,602 కోట్లు

రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి రూ.2,602 కోట్లు

తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోందనడం సరికాదన్న కేంద్ర మంత్రి.. ఇటీవలి రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి రూ.2,602 కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కృషితో చర్లపల్లిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి మార్గం సుగమమైందని, హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేజ్ 2తోపాటు రాష్ట్రంలో కొనసాగుతున్న అన్ని రైల్వే ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని మంత్రి చెప్పారు.

ఓవైసీ ప్రజల్ని భయపెడుతున్నాడు..

ఓవైసీ ప్రజల్ని భయపెడుతున్నాడు..

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై లేనిపోని విషయాలు ప్రచారం చేస్తోన్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గోయల్ మండిపడ్డారు. దానికి అనుగుణంగా టీఆర్ఎస్ సర్కారు కూడా అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామనడం చాలా బాధాకరమని, రాజకీయాల కోసమే కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజ్వేషన్ ప్రకటించారని దెప్పిపొడిచారు.

కేసీఆర్ బాధేంటి?

కేసీఆర్ బాధేంటి?

పొరుగు దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొన్నవారికి భారత్ లో ఆశ్రయం కల్పిస్తుంటే కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందులేంటో అర్థం కావడంలేదని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. పార్లమెంటులో రూపొందించిన చట్టాలను రాష్ట్రాలు అడ్డుకోలేవని కపిల్ సిబాల్ కూడా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు దేశ రాజ్యాంగాన్ని అవమానించేలా ఉందని గోయల్ మండిపడ్డారు.

  Budget 2019 : Assured Income Of Rs 6000 For Farmers Announced | Oneindia Telugu
  ఆ నలుగురి అండతో..

  ఆ నలుగురి అండతో..

  తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరగడం వల్లే నాలుగు ఎంపీ స్థానాలు దక్కాయని, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి దేశమంతటికీ సేవలందిస్తోంటే, మిగతా ముగ్గరు ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాపురావులు రాష్ట్ర ప్రజల కోసం పాటుపడుతున్నారని పీయూష్ గోయల్ అన్నారు. ఆ నలుగురి అండతో, వేలాదిమంది కార్యకర్తల బలంతో బీజేపీ తొందర్లోనే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  English summary
  Railway Minister Piyush Goyal participated several programs in hyderabad on Tuesday. he slams telangana chief minister and it minister kt rama rao for blaming center. bjp is emerging in telangana, he added
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X