• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేంద్ర పెద్దలకు కరోనా కాటు -మంత్రి సంతోష్ గాంగ్వార్, ఇద్దరు బీజేపీ ఎంపీలకు పాజిటివ్ -ఇంకా ఎందరు?

|

భారత్ లో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా, గతంలో కంటే వాయువేగంగా కొనసాగుతున్నది. రోజువారీ కేసులు, మరణాల్లో రికార్డులు నమోదవుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా రాజకీయ రాజయధాని ఢిల్లీలోనూ మహమ్మారి విజృంభిస్తున్నది. కేంద్రం పెద్దలు, అధికార బీజేపీ నేతలు వైరస్ కాటుకు గురవుతున్నారు..

ఆ పెద్ద నేతకు తీవ్రమైన కష్టాలు -జగన్, కేసీఆర్ జాతకాలు ఇలా -ఉగాది వేళ స్వరూపానంద బాంబు -ప్లవ అంటే

కేంద్ర కార్మిక, ఉపాధి క‌ల్ప‌న శాఖ మంత్రి (ఇండిపెండెంట్) సంతోష్ గంగ్వార్‌ తోపాటు రాజ్యసభ బీజేపీ ఎంపీలు సరోజ్ పాండే, అనిల్ బలూనీలకు క‌రోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కేంద్ర మంత్రి, ఇద్దరు బీజేపీ ఎంపీలు ఒకేసారి కరోనా బారినపడటం, నిన్నమొన్నటిదాకా వారంతా అధికారిక సమావేశాల్లో వందల మందిని కలిసి ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.

Union Minister Santosh Gangwar, two BJP MPs test positive for COVID-19

తాను కరోనా బారినపడిన విషయాన్ని కేంద్ర మంత్రి గాంగ్వర్ స్వయంగా వెల్లడించారు. ''నాకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. కానీ క‌రోనాకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య ల‌క్ష‌ణాలు లేవు. ఇటీవ‌లి కాలంలో నన్ను క‌లిసిన పార్టీ కార్య‌క‌ర్త‌లు, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. అంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకుని హోమ్ క్వారెంటైన్‌లో ఉండాలి. క‌లిసిక‌ట్టుగా మ‌హ‌మ్మారిపై విజ‌యం సాధిద్దాం'' అని గాంగ్వర్ ట్వీట్ చేశారు.

మర్కజ్ మసీదుపై సంచలన తీర్పు -మిగతా మతాలకు లేని నిషేధం దానిపై ఎందుకు? -రంజాన్ వేళ తెరవండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం, దేశంలో నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 1,61,736 కొత్త కేసులు, 879 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కు, మరణాల సంఖ్య 1,71,058కు పెరిగింది. గత 24గంటల్లో కొత్తగా 97,168 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,22,53,697 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 12,64,698 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 10,85,33,085 డోసుల టీకాలను వేసినట్లు కేంద్రం పేర్కొంది.

English summary
Union Minister Santosh Gangwar on Tuesday informed that he has tested positive for COVID-19. BJP Rajya Sabha MPs Anil Baluni and Saroj Pandey also teseted positive for covid-19. "I want to inform you that my "Corona test report has come positive". I don't have any kind of symptom, I request that all the people who came in contact with me, please follow the Corona safety rules. Together we will win this epidemic," tweeted Santosh Gangwar. BJP Rajya Sabha MP Anil Baluni on Tuesday informed that he has tested positive too for COVID-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X