వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్ టాక్ కు థాంక్స్ చెప్పిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..నిషేధం తర్వాత వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నవేళ గాల్వాన్ ఘర్షణ కొనసాగుతున్న తరుణంలో చైనాకు చెందిన 59 యాప్స్ పై నిషేధం విధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలా నిషేధించబడిన యాప్స్ లో టిక్ టాక్ కూడా ఉంది. అయితే కరోనా కట్టడి లో భాగంగా టిక్ టాక్ పీపీఈ కిట్లు, విరాళాలు అందించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ టిక్ టాక్ కు ధన్యవాదాలు చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

RIP Tiktok .... టిక్‌టాక్ లో ఫ్యాన్స్ ఆవేదన.. నిషేధంతో టిక్‌టాక్ స్టార్స్ కు షాక్ RIP Tiktok .... టిక్‌టాక్ లో ఫ్యాన్స్ ఆవేదన.. నిషేధంతో టిక్‌టాక్ స్టార్స్ కు షాక్

ఈ వీడియోలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కరోనా మహమ్మారిపై ఐక్యంగా పోరాడాలి అన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుకు విశేషమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు కరోనా కంట్రోల్ కోసం టిక్ టాక్ ఇచ్చిన విరాళాన్ని, పీపీఈ కిట్లను ఉద్దేశించి మాట్లాడిన స్మృతి ఇరానీ టిక్ టాక్ సీఈఓ నిఖిల్ గాంధీ కి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆ వీడియోని అందరికీ చేరేలా షేర్ చేయాలని కూడా స్మృతి ఇరానీ కోరారు.కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటంలో ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలకు 4,00,000 వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) సూట్లను విరాళంగా ఇచ్చినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలుపుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది .

 Union Minister Smriti Irani thanked the Tiktok ... video viral after Tiktok ban

ప్రస్తుతం చైనా యాప్స్ పై విధించిన నిషేధంలో భాగంగా టిక్ టాక్ ను కూడా నిషేధించడంతో ఇప్పుడు స్మృతి ఇరానీ టిక్ టాక్ కు ధన్యవాదాలు చెబుతున్న వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ వీడియోపై ఇప్పటికే విమర్శలు వెల్లువగా మారిన వేళ ముందు ముందు మరెన్ని విమర్శలు రానున్నాయో మరి .

English summary
Central minister smruthi irani's video viral about tik tok . Union minister Smriti Irani thanking the Indian arm of Tik tok for donating 4,00,000 personal protection equipment (PPE) suits for frontline health workers in the fight against Covid-19. after the tik tok ban this video going viral .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X