వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ కంటే ఏఏపీనే ఎంటర్టైన్మెంట్: కేజ్రీవాల్‌పై అగ్నివేష్ బాంబు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ పార్టీలోని రాజకీయం ఢిల్లీ డేర్ డెవిల్స్ కంటే ఎక్కువగా ఎంటర్‌టైన్ చేస్తోందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 8లో భాగంగా ఆడుతున్న డేర్ డెవిల్స్ కంటే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ రాజకీయాలతోనే ఢిల్లీ ప్రజలు ఎక్కువగా ఆనందిస్తున్నారట!

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ గెలుచుకుంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, అప్పటి నుండే ఏఏపీలో రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది.

అది ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ఏఏపీ మద్దతుదారులు.. తాము గతంలో ఇచ్చిన కారు వెనక్కి ఇవ్వాలని, తాను రూపొందించిన ఏఏపీ లోగోను ఉపయోగించవద్దని డిమాండ్ చేశారు.

Unique Delhi: Aam Aadmi Party is more entertaining than Delhi Daredevils

తాజాగా స్వామి అగ్నివేష్ మరో బాంబు పేల్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తన గురువు అయిన హజారేను చంపాలని భావించారని చెప్పినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి! దీనిపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.

2011లో రాంలీలా మైదానంలో అన్నా హజారే దీక్షకు దిగినప్పుడు ఇది జరిగిందని అగ్నివేష్ చెప్పారని తెలుస్తోంది. నాడు ప్రభుత్వం హజారే పెట్టిన డిమాండ్లకు నాలుగో రోజే అంగీకరించింది. అయితే, కేజ్రీవాల్ మాత్రం.. మరో పది రోజులు నిరాహార దీక్ష చేయాలని హజారేపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. తద్వారా కేజ్రీవాల్ తన ప్రయోజనం ఆశించారని ఆరోపించారు.

English summary
What is more entertaining? Politics or cricket? Generally, it is cricket which will win hands down if such a poll is held but in Delhi, the result could be different, thanks to a new type of political outfit which has come to power in that state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X