వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూరులో హైకోర్టును బాంబులతో పేల్చేస్తాం, రిజిస్టార్ కు లేఖ, విధాన సౌధ, పాక్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక హైకోర్టును బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు లేఖ పంపించడంతో బెంగళూరులో కలకలంరేగింది. కర్ణాటక హైకోర్టుతో పాటు అనేక ప్రసిద్ది ప్రాంతాలను బాంబులతో పేల్చుతామని, ఉగ్రదాడులే మాలక్షం అని గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాయడంతో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పాక్ మద్దతుదారుల కోసం గాలిస్తున్నారు.

పిల్ల కావాలని పెళ్లి ప్రకటన, కొంప ముంచిన ఇటలీ యువతి, నెలకు రూ. 1 లక్ష వడ్డి !పిల్ల కావాలని పెళ్లి ప్రకటన, కొంప ముంచిన ఇటలీ యువతి, నెలకు రూ. 1 లక్ష వడ్డి !

కేవలం నెల రోజుల క్రితం ఉగ్రవాదులు బెంగళూరును టార్గెట్ చేసుకున్నారని వెలుగు చూడటంతో పోలీసులు ఇప్పటికే రైల్వేష్టేషన్, ఎయిర్ పోర్టు, మెజస్టిక్, సిటీ మార్కెట్ తదితర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో నేటికి పోలీసులు తనికీలు చేస్తున్నారు.

Unknown Person Send Threatening Letter To High Court (Karnataka) Registrar.

ఇదే సమయంలో కర్ణాటక హైకోర్టును బాంబులతో పేల్చుతామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. కర్ణాటక హైకోర్టు రిజిస్టార్ కు నేరుగా ఉత్తరం రావడంతో ఆయన విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక హైకోర్టుతో పాటు బెంగళూరు నగరంలోని ప్రముఖ కట్టడాలను తాము టార్గెట్ చేసుకున్నామని ఆ లేఖలో సమాచారం ఉందని వెలుగు చూసింది.

అంతర్జాతీయ ఖలిస్తాన్ గ్రూప్ కు చెందిన తాను, తన కొడుకుతో సహ మరో కొంత మంది బాంబు దాడులు చెయ్యడానికి సిద్దం అయ్యామని ఆలేఖలో వివరాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లష్కర్ ఏ తోయిబాకు చెందిన 6 మంది నిందితులు ఇప్పటికే కేరళలోని కాసరగూడు (కర్ణాటక సరిహద్దు)లో తల దాచుకున్నారని అధికారులు వివరాలు సేకరించారు.

లక్ష్మీకి అక్రమ మైనింగ్, సోలార్ ప్లాంట్ లింక్, డీకే బినామీ?, ఎన్ని కోట్ల ఆస్తి, క్రిమినల్!లక్ష్మీకి అక్రమ మైనింగ్, సోలార్ ప్లాంట్ లింక్, డీకే బినామీ?, ఎన్ని కోట్ల ఆస్తి, క్రిమినల్!

నిందితులు శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో భారత్ లో ప్రవేశించారని, బెంగళూరు, అహమ్మదాబాద్, ఢిల్లీ నగరాలను టార్గెట్ చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని అధికారులు అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారు. కోయంబత్తూరు, ఊటీ, మైసూరు మార్గంలో నిందితులు బెంగళూరులో ప్రవేశించే అవకాశం ఉందని వెలుగు చూడటంతో ఆ మార్గంలో సోదాలు ముమ్మరం చేశారు.

పాకిస్థాన్ కు చెందిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు ఆరు మంది భారత్ లో ప్రవేశించి సిలికాన్ సిటీ బెంగళూరు నగరంతో పాటు వివిద నగరాల్లో దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు హెచ్చరించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా కర్ణాటక హైకోర్టు మీద బాంబు దాడులు చేస్తామని ఉగ్రవాదులు లేఖ రాయడంతో పోలీసులు మరింత భద్రత కట్టుదిట్టం చేశారు.

English summary
Bengaluru: Unknown Person Send Threatening Letter To High Court (Karnataka) Registrar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X