వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ప్రధాని మోడీ బాయ్ కాదు, మనిషిని, రాహుల్ గాంధీ, రాహుల్ గ్రేట్, శివసేన !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Gujarat Assembly Election : Campaigning for first phase ends today | Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ప్రధాని మోడీ మీద కాంగ్రెస్ పార్టీ యువరాజు వ్యంగ్రాస్త్రాలు సంధింస్తున్నారు.

నేను మోడీ బాయ్ కాదు, మనిషిని!

నేను మోడీ బాయ్ కాదు, మనిషిని!

నేను నరేంద్ర మోడీ బాయ్ కాదు, మనిషిని. మనుషులు తప్పులు చేస్తుంటారు. అందుకే జీవితం ఆసక్తిగా మారుతుంది అంటూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ బాయ్ తప్పు చెయ్యనట్లు వ్యవహరిస్తారని రాహుల్ గాంధీ వ్యంగంగా అన్నారు.

నేను తప్పులు చేశాను

నేను తప్పులు చేశాను

నా తప్పులు కనిపెట్టింనందుకు చాలా థ్యాంక్స్‌. ఇదే విధంగా నా తప్పులు గమనించి చెప్పండి. నేను ఇంకా పరిణితి చెందడానికి ఉపయోగ పడుతుంది. ప్రజలకు సేవ చెయ్యడానికి నేను సిద్దంగా ఉన్నాను. లవ్‌ యూ ఆల్‌ అంటూ బీజేపీ నాయకులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ట్వీట్ చేసి చురకలు అంటించారు.

 ఆరోగ్య చికిత్స ఖర్చులు !

ఆరోగ్య చికిత్స ఖర్చులు !

గుజరాత్ లో 39 శాతం మంది పిల్లలకు పోషకాహరం అందక బాధపడుతున్నారని, ప్రతి వెయ్యిమందిలో 33 మంది సరైన సమయంలో చికిత్స అందక చనిపోతున్నారని, రాష్ట్రంలో డాక్టర్ల కొరత చాల ఎక్కువగా ఉందని, ఆరోగ్య చికిత్స ఖర్చులు అధికంగా పెరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.

స్నేహితుడి కోసం !

స్నేహితుడి కోసం !


తన స్నేహితుడి కోసం భుజ్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిని 99 ఏళ్లకు లీజ్ కు ఇచ్చిన బీజేపీ గుజరాత్ రాష్ట్రంలో ప్రజారోగ్య పర్యవేక్షణకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరికీ అర్థం అవుతోందని, ఈ విషయంపై బీజేపీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

22 ఏళ్లలో ఏం చేశారు ?

22 ఏళ్లలో ఏం చేశారు ?

గుజరాత్ ను 22 ఏళ్లు పాలించిన బీజేపీ నాయకులు రాష్ట్రాన్ని ఎంత మాత్రం అభివృద్ది చేశారు అని బహిరంగంగా చెప్పాలని, ఈ ప్రశ్న తాను వెయ్యడం లేదని, గుజరాత్ ప్రజలు అడుగుతున్నారని రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ప్రశ్నించారు.

రాహుల్ గ్రేట్: శివసేన

రాహుల్ గ్రేట్: శివసేన

గుజరాత్‌ శాసన సభ ఎన్నికలు రాహుల్ గాంధీని బలమైన నాయకుడిగా తయారు చేశాయని శివసేన తన అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. రాహుల్ గాంధీ ఇక మీద ఎంత మాత్రం పప్పు కాదని, ఆయన బలమైన రాజకీయ నాయకుడు అనే విషయాన్ని బీజేపీ నాయకులు అంగీకరించాలని శివసేన తన సామ్నా సంపాదకీయంలో డిమాండ్ చేసింది.

రాహుల్ లెక్కలు తెలీదు

రాహుల్ లెక్కలు తెలీదు

గుజరాత్‌ శాసన సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిత్యావసరాల ధరల పెరుగుదలపై శాతాలను తప్పుగా ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్లపై బీజేపీ నేతలు జోకులు పేలుస్తున్నారు. రాహుల్ గాంధీకి లెక్కలు కూడా రావని, ఇక ప్రజలకు ఏం సేవ చేస్తారని చురకలు అంటిస్తున్నారు.

English summary
Congress party leader Rahul Gandhi took a swipe at Prime Minister Narendra Modi, saying that ‘unlike Narendrabhai’ he was human and could err, as he thanked his BJP friends for pointing out wrong figures in one of his tweets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X