వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Unlock 1.0: నేటి నుండి బిజినెస్ బిజీబిజీ..వ్యాపార వర్గాల్లో చిగురించిన ఆశలు

|
Google Oneindia TeluguNews

ఒకపక్క భారతదేశంలో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతుంటే, ఇండియాలో అన్ లాక్ 1.0 ప్రారంభమైంది .దీంతో గత 80 రోజులుగా మూతపడిన షాపింగ్ మాల్స్,హోటల్స్, రెస్టారెంట్లు ఊపిరి తీసుకోబోతున్నాయి. 80 రోజులుగా వ్యాపార కార్యకలాపాలు సాగక తీవ్ర ఆర్థిక నష్టాలలో, చెప్పలేని కష్టాలలో సతమతమైన వర్తక, వాణిజ్య సంస్థలన్నీ నేటి నుంచి తెరుచుకుంటాయి. దీంతో ఈరోజు నుండి ఇండియాలో మళ్లీ బిజినెస్ బిజీబిజీగా మారుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అన్ లాక్ 1.0 ప్రారంభించిన ఇండియా .. నేటి నుండి యధావిధిగా బిజినెస్

అన్ లాక్ 1.0 ప్రారంభించిన ఇండియా .. నేటి నుండి యధావిధిగా బిజినెస్

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. 80 రోజుల పాటు కొనసాగిన లాక్ డౌన్ తో అన్ని రంగాలు కుదేలయ్యాయి . ఇక మరిన్ని రోజులు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలావరకు వర్తక, వాణిజ్యాలు దివాలా తీసే పరిస్థితి. ఇక ఇప్పటికే కరోనా సంక్షోభాన్ని మించిన ఆర్థిక సంక్షోభం భారతదేశంలో కరోనా లాక్ డౌన్ తో ఏర్పడింది. ఇక ఈ పరిస్థితి నుండి బయట పడడానికి ప్రభుత్వం కరోనాకేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, భారతదేశం అత్యంత ప్రభావితం అవుతున్న దేశంగా మారుతున్నప్పటికీ అన్ లాక్ 1.0 ప్రారంభించింది.

వ్యాపార వర్గాల్లో కనిపిస్తున్న ఉత్సాహం .. నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు

వ్యాపార వర్గాల్లో కనిపిస్తున్న ఉత్సాహం .. నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు

ఇక నేటి నుండి పలు రంగాల్లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాపార వర్గాల్లో కాస్త ఉత్సాహం కనిపిస్తోంది. అయితే కరోనా వ్యాప్తిని నియంత్రించేలా వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ భద్రత నిబంధనలను అనుసరించి వర్తక వాణిజ్యాలు నిర్వహించాలని ప్రణాళికలను రూపొందించాయి వాణిజ్య సముదాయాలు.

Recommended Video

India China border standoff Latest news
వర్తక వాణిజ్యాలు పుంజుకునే పరిస్థితి ..

వర్తక వాణిజ్యాలు పుంజుకునే పరిస్థితి ..


స్టార్ హోటల్స్, లాడ్జీలు, రెస్టారెంట్స్, మాల్స్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి గేట్ల వద్ద శానిటైజేషన్ ,థర్మల్ స్క్రీనింగ్ కు ఏర్పాట్లు చేసుకున్నాయి. దాదాపుగా పూర్తి స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి దేశం రెడీ అయింది. కరోనావైరస్ వ్యాప్తి నియంత్రించడానికి విధించిన లాక్ డౌన్ నుండి ఇప్పటికే చాలా వరకు మినహాయింపులు ఇచ్చిన పరిస్థితిలో ఇప్పటికే జనజీవనం సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక ఇప్పుడు దాదాపు పూర్తిగానే సడలింపు ఇచ్చిన నేపథ్యంలో వర్తక వాణిజ్యాలు పుంజుకునే పరిస్థితి ఉండగా కరోనా వ్యాప్తి దీనివల్ల బాగా జరుగుతుందన్న అనుమానాలు సైతం పెరుగుతున్నాయి.

English summary
On the one hand, corona cases are on the rise in India, Unlock 1.0 has begun in India .The shopping malls, hotels and restaurants that have been closed for the past 80 days are going to open and taking a long breathe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X