వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్‌లాక్ 2.0 : వేటికి మినహాయింపులు... వేటిపై నిషేధం... వివరాలివే...

|
Google Oneindia TeluguNews

జూన్ 30తో అన్‌లాక్ 1.0 ముగుస్తున్నందునా కేంద్రం అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. జూలై 1 నుంచి కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. పాత మార్గదర్శకాలకే కొన్ని మార్పులు,చేర్పులు చేసి తాజా ఉత్తర్వులు జారీ చేశారు. ఓవైపు తమిళనాడు,మహారాష్ట్ర ప్రభుత్వాలు జూలై 31 వరకు లాక్ డౌన్ పొడగించగా... కేంద్రం అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలు విడుదల చేయడం గమనార్హం.

రాత్రిపూట కర్ఫ్యూ... మినహాయింపులు....

రాత్రిపూట కర్ఫ్యూ... మినహాయింపులు....

తాజా మార్గదర్శకాల ప్రకారం... రాత్రిపూట 10గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. అయితే మల్టిపుల్ షిఫ్టుల్లో కార్యకలాపాలు సాగించే ఇండస్ట్రియల్ యూనిట్లకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చింది. అలాగే జాతీయ రహదారులపై గూడ్స్ వాహనాల రాకపోకలు,కార్గో లోడింగ్-అన్‌లోడింగ్‌కు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చింది. బస్సులు, రైళ్లు మరియు విమానాల నుంచి దిగిన తరువాత తమ గమ్యస్థానాలకు వెళ్లే వ్యక్తుల ప్రయాణాలకు కూడా మినహాయింపునిచ్చింది.

వేటికి అనుమతి....

వేటికి అనుమతి....

స్కూళ్లు,కాలేజీలు,కోచింగ్ సెంటర్లు జూలై 31 వరకు మూతపడనున్నాయి. దేశీయ విమాన సర్వీసులు,ప్యాసింజర్ రైళ్లను క్రమంగా పెంచుతామని తెలిపింది. అలాగే ప్రార్థన మందిరాలు,హోటళ్లు,రెస్టారెంట్లు,షాపింగ్ మాల్స్‌కు అనుమతిచ్చింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్స్ కార్యకలాపాలను జూలై 15 నుంచి అనుమతించింది.

Recommended Video

#BoycottNetflix : Krishna And His Leela మూవీ పై హిందూ సంఘాల ఫైర్
వీటిపై నిషేధం...

వీటిపై నిషేధం...

వ్యక్తులు లేదా గూడ్స్ ఇంటర్‌ స్టేట్,ఇంట్రా స్టేట్ రవాణాకు ఎలాంటి నిబంధనలు లేవని తెలిపింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేందుకైనా ప్రత్యేక అనుమతులేవీ అవసరం లేదని చెప్పింది. ఇక మెట్రో రైళ్లు,సినిమా హాళ్లు,జిమ్నాజియం,స్విమ్మింగ్ పూల్స్,ఎంటర్టైన్‌మెంట్ పార్కులు,థియేటర్లు,బార్స్,ఆడిటోరియమ్స్,అసెంబ్లీ హాల్స్‌పై నిషేధం విధించింది. సామాజిక,రాజకీయ,క్రీడ,వినోద,విద్యా,సాంస్కృతిక,మత పరమైన సమావేశాలపై కూడా నిషేధం కొనసాగించింది.

English summary
The government on June 29 released guidelines for second phase of Unlock in which certain economic and social activities have been permitted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X