వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్‌లాక్ 3.0: సీఎంలతో రేపు ప్రధాని కాన్ఫరెన్స్ - సినిమా హాళ్లు రీఓపెన్.. స్కూళ్లు బంద్?

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశకు(సామూహిక వ్యాప్తి) చేరిందా? అనేంత ప్రమాదకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 48,661 పాజిటివ్ కేసులు, 705 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14లక్షలు దాటగా, మరణాల సంఖ్య 32వేల మార్కును అధిగమించింది. సెప్టెంబర్ నాటికి కోటి కేసులు, లక్ష మరణాలు నమోదు కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నవేళ.. రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్ళాలనేదానిపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Recommended Video

COVID-19 : CM లతో Modi కీలక సమావేశం.. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో చర్చ! || Oneindia Telugu

సాహో సోనూ సూద్.. చిత్తూరు పేదకు భారీ సాయం.. 'కాడెద్దులుగా కూతుళ్లు' వీడియో వైరల్ కావడంతో..సాహో సోనూ సూద్.. చిత్తూరు పేదకు భారీ సాయం.. 'కాడెద్దులుగా కూతుళ్లు' వీడియో వైరల్ కావడంతో..

కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ప్రకటించిన అన్ లాక్ 2.0 ఈ నెలాఖరుతో ముగియనుంది. కరోనా కేసుల ఉధృతి ఎలా ఉన్నప్పటికీ ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించబోమని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. లాక్ డౌన్ నిర్ణయాధికారాలను పూర్తిగా రాష్ట్రాలకే కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి ప్రారంభం కాబోయే అన్ లాక్ 3.0 ఎలా ఉండాలి? దేశంలో కరోనా కట్టడికి ఏం చేయాలి ? పెరుగుతోన్న కొత్త కేసులకు అనుగుణంగా ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? తదితర అంశాలను ముఖ్యమంత్రులతో మోదీ చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కూడా పాలుపంచుకోనున్నారు. కాగా,

 జగన్ డ్రీమ్-ఏపీ చరిత్రలో అతిపెద్ద లిఫ్ట్ -రాయలసీమ ఎత్తిపోతలపై కీలక పరిణామం- కేసీఆర్ సర్కారు గగ్గోలు జగన్ డ్రీమ్-ఏపీ చరిత్రలో అతిపెద్ద లిఫ్ట్ -రాయలసీమ ఎత్తిపోతలపై కీలక పరిణామం- కేసీఆర్ సర్కారు గగ్గోలు

Unlock 3.0: pm modi to interact with cms on monday, sources says Cinemas likely to reopen

అన్ లాక్ 3.0లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సినిమా థియేటర్లు, జిమ్ ల రీఓపెన్ కు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ముందుగా కొవిడ్ రూల్స్ ప్రకారం 25 శాతం సీట్లను మాత్రమే అనుమతించేలా, ఆపై 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు నడుపుకొనేలా ఆయా యాజమాన్యాలకు మార్గదర్శకాలు జారీ చేయబోతున్నట్లు రిపోర్టులు వచ్చాయి. అదే సమయంలో స్కూళ్లు, కాలేజీలు, మెట్రో రైలు సర్వీసులను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరాదని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం జారీ చేసే మార్గదర్శకాలపై ఆయా రాష్ట్రాలు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే వీలు కల్పించనున్నారు.

కరోనా విలయానికి తోడు జులై చివరి వారం నుంచి నవంబర్ వరకు దేశంలో సీజనల్ వ్యాధులు విజృంభించే సమయం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాటి తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రజల్ని హెచ్చరించారు. మాస్కుల వాడకం, పరిసరాల పరిశుభ్రతను తేలికగా తీసుకోరాదని, కరోనా ఇప్పటికీ ప్రాణాంతక వ్యాధిగానే కొనసాగుతున్నదని ఆయన చెప్పారు.

English summary
PM Narendra Modi to discuss COVID-19 situation with CMs of all states on monday(July 27). several media reports claim that Schools, metros to remain shut and Cinemas, gyms likely to open in unlock 3.0.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X