• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అన్‌లాక్ 6.0 లేదు: 5.0 సడలింపులే కొనసాగింపు, కానీ, కొన్ని షరతులు

|

న్యూఢిల్లీ: ఈసారి కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 6.0ను ప్రకటించలేదు. కానీ, సెప్టెంబర్ నెల చివరలో విడుదల చేసిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలనే కేంద్రం మరో నెలపాటు పొడిగించింది. అక్టోబర్ నెలకు ప్రకటించిన నిబంధనలే నవంబర్ నెలాఖరు వరకు వర్తిస్తాయని వెల్లడించింది. కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది.

కరోనా కోరల నుంచి బయటపడుతున్నామా?: ఈ తగ్గుదల దేనికి సంకేతం?: మరణాల్లోనూ అదే స్థితి

కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగింపు..

కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగింపు..

ఇక కంటైన్మెంట్ జోన్లలో అన్ని రకాల ఆంక్షలూ కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. కంటైన్మెంట్ల బయట దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. అయితే, అంతర్జాతీయ ప్రయాణాలు, స్విమ్మింగ్ ఫూల్స్, వ్యాపార సమావేశాలు, వ్యాపార సంబంధిత ఎగ్జిబిషన్లు, 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాళ్లు తెరుచుకునేందుకు సెప్టెంబర్ 30న ప్రకటించిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాల్లో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. వీటినే నవంబర్ 30 వరకు కొనసాగించేందుకు కేంద్ర అనుమతిచ్చింది. అయితే, కంటైన్మెంట్ జోన్లలో మాత్రం నవంబర్ 30 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.

మోడీ ‘జన్ ఆందోళన్'లో భాగస్వాములుకండి..

మోడీ ‘జన్ ఆందోళన్'లో భాగస్వాములుకండి..

కరోనావైరస్ విజృంభణతో మార్చి నెల నుంచి దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ విధించిన కేంద్రం.. ఆ తర్వాత మే నెల నుంచి క్రమంగా సడలింపులను ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 8న కరోనాపై పోరాటమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘జన్ ఆందోళన్' కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని హోంశాఖ సూచించింది. మాస్కులు ధరించడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం వంటివి ప్రతి ఒక్కరూ పాటించాలని కోరింది. వీటిపై ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేపట్టాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా,

నవంబర్ 30 వరకు కొనసాగనున్న సడలింపులు

నవంబర్ 30 వరకు కొనసాగనున్న సడలింపులు

పాఠశాలలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు పునర్ ప్రారంభంపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు

వినోద పార్కులు, ఆ కోవలోకి వచ్చే ఇతర స్థలాలను తెరుచుకోవచ్చు.

బిజినెస్ టు బిజినెస్ ఎగ్జిబిషన్లూ ప్రారంభించుకోవచ్చు.

క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే ఈత కొలనులు తెరవచ్చు.

సభలు, సమావేశాల్లో 100 మందికి మించి పాల్గొనకూడదని ప్రస్తుతం ఉన్న పరిమితిని పెంచుకునే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించింది.

కంటైన్మెంట్ జోన్ల బయట మరిన్ని కార్యక్రమాలకూ అనుమతి.

తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితో విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలి.

హాజరును తప్పనిసర చేయకూడదు. ఈ విషయంలో తల్లిదండ్రుల అనుమతి మేరకే నడుచుకోవాలి.

కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల ప్రారంభ తేదీలపై హోంశాఖతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.

ఆంక్షలు కొనసాగింపు. షరతులు

ఆంక్షలు కొనసాగింపు. షరతులు

అన్ని వైపులా మూసివుండే సమావేశ మందిరాల్లో గరిష్ట సామర్థ్యంలో 50 శాతం వరకే అనుమతించాలి. అది కూడా 200 మందికి మించకూడదు.

థర్మల్ స్కానింగ్, మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి.

బహిరంగ స్థలాల్లో అయితే, కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.

రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో అంతర్గతంగా వ్యక్తులు వాహనాలు, సరుకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదు.

కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కంటైన్మెంట్ జోన్ల బయట రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించకూడదు.

కాగా, కరోనా ఉధృతి నేపథ్యంలో మార్చి నెల నుంచి దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే, మే నెల నుంచి క్రమంగా లాక్‌డౌన్ సడలింపులను ప్రకటిస్తూ వస్తోంది కేంద్రం.

English summary
The Ministry of Home Affairs (MHA) issued an order on Tuesday to extend the guidelines for re-opening, issued on September 30, to remain in force up to November 30, 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X