వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడోసారి సీఎం పదవి మూడు రోజులే: యడ్యూరప్పను వెన్నాడుతున్న దురదృష్టం

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: మూడోసారి కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప పూర్తికాలం పదవిలో ఉండలేదు. కేవలం మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఇప్పటికీ మూడు దఫాలు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ, మూడు దఫాలు కూడ పూర్తి కాలం పాటు యడ్యూరప్ప సీఎం పదవిలో కొనసాగలేదు.దురదృష్టం యడ్యూరప్పను వెన్నాడుతోంది.

కర్ణాటక రాష్ట్రానికి 23వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప మే 17వ తేదినప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసెంబ్లీ యడ్యూరప్ప బలనిరూపణను మే 19వ తేదిన చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, విశ్వాసపరీక్షకు వెళ్ళక ముందే యడ్యూరప్ప అసెంబ్లీలోనే రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో పూర్తికాలం పాటు సీఎం పదవిలో యడ్యూరప్ప లేరు. ఈ రకంగా పూర్తి కాలం పాటు సీఎం పదవిలో లేకుండా యడ్యూరప్ప కొనసాగడం ఇది మూడోసారి.

Unlucky again, and again, and again: The tragedy of Bookanakere Siddalingappa Yeddyurappa

గతంలో రెండు దఫాలు కూడ యడ్యూరప్ప మధ్యంతరంగానే సీఎం పదవిని కోల్పోయారు. 2007 నవంబర్‌ 12న కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యత లు చేపట్టారు. అప్పట్లో జేడీఎస్‌ సహకారంతో ఆయన సంకీర్ణ పాలనకు శ్రీకారం చుట్టారు. కాని జేడీఎస్‌ మద్దతుకు అంగీకరించకపోవడంతో కేవలం వారం రోజులకే పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత 2008 శాసనసభ ఎన్నికల్లో షికారిపుర నుంచి మరోసారి 45వ ఎమ్మెల్యేగా ఎన్నికై 2008 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అక్రమ మైనింగ్‌ కేసును దర్యాప్తు చేస్తూ కర్ణాటక లోకాయుక్త సీఎం యడ్యూరప్ప పేరును చేర్చడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఒత్తిడి మే రకు 2011 జులై 31న ఆయన రాజీనామా చేశారు.

ఇలా రెండు దఫాలు యడ్యూరప్ప సీఎం పదవికి దూరం కావాల్సి వచ్చింది. కనీస మెజార్టీ లేకున్నా 2018 మే 17న, సీఎంగా యడ్యూరప్ప బాధ్యతలు చేపట్టారు.కానీ, కనీస మెజారిటీ లేకున్నా యడ్యూరప్ప సీఎం పదవిని చేపట్టారు. అయితే బలపరీక్ష సమయంలో ఉద్వేగంగా ప్రసంగం చేసి యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. మూడో సారి మూడు రోజులు మాత్రమే సీఎం పదవిలో యడ్యూరప్ప సీఎం పదవిలో కొనసాగారు. యడ్యూరప్పను దురదృష్టం కొనసాగుతోంది.

English summary
BS Yeddyurappa's tenure as Karnataka chief minister eventually lasted only for three days. On Saturday,Yeddyurappa become the Chief Minister for the first time in October 2007 in the BJP-Janata Dal-Secular (JD-S) coalition government, he lasted in the post for over a month, as the regional party (JD-S) withdrew support, resulting in its fall in November 2007.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X