వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నావ్ అత్యాచార ఘటన: ధర్నాకు దిగిన అఖిలేష్ యాదవ్...అక్కడికి ప్రియాంకా గాంధీ

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ విధానసభ బయట ధర్నాకు కూర్చున్నారు. హైదరాబాద్‌లో జరిగిన దిశా ఘటన మరువక ముందే ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి చెందడం బాధాకరమన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతి భద్రతలు గాడి తప్పాయని సీఎం యోగీ ఆదిత్యానాథ్ పై మాజీ సీఎం విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఉత్తర్ ప్రదేశ్ చరిత్రలో బ్లాక్ డే అని అఖిలేష్ అన్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఉన్నావ్‌కు బయలుదేరి వెళ్లారు. ఉన్నావ్‌లో అంతకంటే ముందు ఒక ఘటన జరిగిన తర్వాత కూడా బాధితురాలికి ప్రభుత్వం లేదా పోలీసులు ఎందుకు రక్షణ కల్పించలేదని ప్రశ్నించారు. ఈ ఏడాది జూలైలో ఓ ఉన్నావ్ జిల్లాలోనే ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెన్‌గార్ అత్యాచారం చేసిన ఘటనను ప్రియాంకా గుర్తు చేశారు. ఆ సమయంలో బాధితురాలు ఓ కారులో వెళుతుండగా ఆమె కారును ట్రక్కు ఢీకొంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాజా ఉన్నావ్ బాధితురాలి ఘటనలో ఎందుకు భద్రత కల్పించలేదని ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు.

Unnao incident: Akhilesh stages Dharna, demands justice for victims family

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కూతురికి సత్వర న్యాయం జరగాలంటే నిందితులను హైదరాబాద్ దిశ ఘటనలో పోలీసులు ఎలా అయితే ఎన్‌కౌంటర్ చేశారో అలానే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే కోర్టుకు హాజరు అయ్యేందుకు వస్తుండుగా ఆమెపై కొందరు దుండగులు నిప్పు అంటించారు. దీంతో 90శాతం కాలిన గాయాలతో హాస్పిటల్‌లో చేరింది. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు తుదిశ్వాస విడిచింది.

తీవ్ర గాయాలపాలైన బాధితురాలని హెలికాఫ్టర్ ద్వారా ఢిల్లీలోని సఫ్దార్జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ ఐదుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపాల్సిందే అని డిమాండ్ చేసిన బాధితురాలి సోదరుడు ...సమాజంలో నుంచి వారి పేర్లు తొలగిపోవాలని ధ్వజమెత్తాడు. వారిని ఎన్‌కౌంటర్ చేస్తేనే తన సోదరి ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పాడు. యోగీ ఆదిత్యనాథ్ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తనను కాపాడాల్సిందిగా బాధితురాలు వేడుకొందని అయితే ఆమెను కాపాడుకోలేకపోయానని కన్నీరు మున్నీరయ్యాడు.

English summary
Former chief minister and Samajwadi Party chief Akhilesh Yadav staged a Dharna outside Vidhan bhavan ans slammed Yogi government over law and order situation in UP.He also demanded immediate justice to Unnav rape victim who died on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X