వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నావ్ రేప్: బిజెపి ఎమ్మెల్యేకు లైంగిక పటుత్వ పరీక్షలు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్ అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎమ్మెల్యేకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతిని కోరుతున్నారు.

ఉన్నావ్ రేప్ కేసు ఘటనలో బిజెపి ఎమ్మెల్యే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సిబిఐ కస్టడీలో 12 రోజుల పాటు ఎమ్మెల్యే ఉన్నారు. కస్టడీ ముగియడంతో ఎమ్మెల్యేను శుక్రవారం నాడు కోర్టు ముందు హజరుపర్చనున్నారు.

Unnao rape accused Kuldeep Singh Sengar likely to undergo potency test

అయితే ఈ సమయంలో బిజెపి ఎమ్మెల్యేకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని సీబీఐ అధికారులు కోర్టుకు దరఖాస్తు చేయనున్నారు.విచారణలో ఎమ్మెల్యే సరైన సమాధానాలు చెప్పని కారణంగా సీబీఐ అధికారులు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఉన్నావ్ రేప్ కేసు ఘటనకు సంబంధించి యూపీ రాష్ట్రంలో విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. అలహబాద్ కోర్టు ఆగ్రహంతో సీబీఐ అధికారులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.

గత ఏడాది జూన్‌లో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం నిరసనకు దిగింది.అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా తనపై బురద చల్లేందుకు ఈ అంశాన్ని తెరమీదికి తెచ్చారని ఆయన ఆరోపించారు.

English summary
The Central Bureau of Investigation (CBI) has decided to get a ‘potency test’ conducted on BJP MLA Kuldeep Singh Sengar, accused in the Unnao rape case, sources in the investigation agency said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X