వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నావ్ రేప్ కేసు: నిందితుడిపై సీబీఐ ఛార్జీషీటు నమోదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌ లైంగిక దాడి కేసులో నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌పై సీబీఐ బుధవారం ఛార్జీషీట్‌ దాఖలు చేసింది. లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడైన కుల్దీప్‌ సెంగార్‌ ప్రస్తుతం విచారణ ఖైదీగా జైలులో ఉన్నారు.

గతంలో బాధితురాలి తండ్రి హత్యకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే సోదరుడుతో పాటు మరో నలుగురిపై సీబీఐ తొలి ఛార్జీషీట్‌ను దాఖలు చేసింది. కాగా, నిందితులపై హత్య, సంబంధిత నేరాభియోగాలు నమోదు చేశామని సీబీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Unnao rape case: CBI files chargesheet against BJP MLA Kuldeep Singh Sengar

సెంగార్‌ సోదరుడు జై దీప్‌ సింగ్‌, ఆయన అనుచరులు వినీత్‌ మిశ్రా, వీరేంద్ర సింగ్‌, రామ్‌ శరణ్‌ సింగ్‌ అలియాస్‌ సోను సింగ్‌, శశి ప్రతాప్‌ సింగ్‌ అలియాస్‌ సుమన్‌ సింగ్‌లపై ఛార్జీషీటు నమోదైంది. వీరంతా ఉన్నావ్‌ జిల్లాలోని మాఖి గ్రామానికి చెందిన వారని అధికారులు తెలిపారు.

English summary
The Central Bureau of Investigation (CBI) filed a chargesheet against BJP MLA Kuldeep Singh Sengar in the Unnao rape case on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X