వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కులదీప్‌ను ఎప్పుడు ఉరితీస్తారు: ఉన్నావ్ బాధితురాలు, 20న సీబీఐ కోర్టులో వాదనలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలిన ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ శిక్ష ఖరారు చేసే విషయంపై వాదనలను సీబీఐ న్యాయస్థానం డిసెంబర్ 20కి వాయిదా వేసింది. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెంగార్ దాఖలు చేసిన అఫిడవిట్ కాపీని సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని సూచించింది.

ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే దోషి.. తేల్చిన కోర్టు, 19న శిక్ష ఖరారుఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే దోషి.. తేల్చిన కోర్టు, 19న శిక్ష ఖరారు

సోమవారం దోషిగా తేల్చిన కోర్టు.. మంగళవారం ఏ శిక్ష విధించాలన్న విషయంపై విచారణ జరిపింది. ఈ కేసులో సంగార్‌కు జీవితకాల శిక్ష విధించాలని వాదనల సందర్భంగా సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది. బాధితురాలికి తగిన పరిహారం అందించేలా చూడాలని అభ్యర్థించింది.

Unnao rape case: Convicted Kuldeep Singh Sengers sentencing deferred to Dec 20

కాగా, సీబీఐ వాదనలను సెంగార్ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. సెంగార్ గత కొన్ని దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారని, సమాజం కోసం చేశారని చెప్పారు. ఆయనకు తక్కువ విధించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను డిసెంబర్ 20 వాయిదా వేసింది.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో కులదీప్ సింగ్ సింగార్‌ను సోమవారం ఢిల్లీలోని తీస్ హాజరీ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఇది ఇలావుండగా, తీస్ హాజరీ కోర్టు కులదీప్‌ను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును ఉన్నావ్ అత్యాచార బాధితురాలు స్వాగతించారు.

అయితే, దోషిగా తేలిన కులదీప్ సింగార్‌ను ఎప్పుడు ఉరితీస్తారంటూ అత్యాచార బాధితురాలు ప్రశ్నించింది. ప్రస్తుతం బాధితురాలు ఢిల్లీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. బాధితురాలు సోదరి మాట్లాడుతూ.. తాను తీర్పు గురించి చెప్పానని, ఆమె సంతోషించిందని తెలిపారు. దోషిని ఎప్పుడు ఉరితీస్తారని అడిగిందని చెప్పారు.

అయితే, తన సోదరి ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదని ఆమె తెలిపారు. ఇప్పటికే తమ తండ్రిని, మరో సమీప బంధువుని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులు ఎప్పటికీ స్వేచ్ఛగా రోడ్డుపై తిరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నిందితుడు బయటికొస్తే తమ కుటుంబానికి ముప్పేనని అన్నారు. తమ కుటుంబాన్ని నాశనం చేశారని, న్యాయం కోసం పోరాడినందుకు తమ వాళ్లను పొట్టనపెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలి తల్లి.

బాధితురాలిపై దారుణం

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడి ఉన్న బీజేపీ బహిష్కృత నేత కులదీప్ సింగ్ సెంగార్‌ను కోర్టు దోషిగా తేల్చింది.

ఆగస్టు 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టారు న్యాయమూర్తి ధర్మేష్ శర్మ. డిసెంబర్ 19న కులదీప్‌కు తీస్ హజారీ కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లక్నో కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు బదిలీ అయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌పై ఆరోపణలు రావడంతో ఆ పార్టీ అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఉన్నావో ఘటనపై జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ తన ఛాంబర్‌లోనే (ఇన్ కెమెరా) విచారణ ముగించారు. సీబీఐ కూడా ఈ కేసుకు సంబంధించిన సాక్షాధారాలతో వాదన వినిపించింది. దీంతో ఆగస్టు 5 నుంచి కేసును ప్రతి రోజూ విచారణకు చేపట్టారు.

2017 సంవత్సరంలో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ ఆ మహిళను అపహరించి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. ఆమె అపహరణకు గురైనప్పుడు మైనర్ బాలికగా ఉంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బెంగర్‌మౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సెంగార్ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో సెంగార్‌ను ఈ ఏడాది ఆగస్టులో బీజేపీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

2017 సంవత్సరంలో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ ఆ మహిళను అపహరించి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. ఆమె అపహరణకు గురైనప్పుడు మైనర్ బాలికగా ఉంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బెంగర్‌మౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సెంగార్ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో సెంగార్‌ను ఈ ఏడాది ఆగస్టులో బీజేపీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

లైంగిక వేధింపుల నుంచి చిన్న పిల్లల సంరక్షణకు సంబంధించిన (పోక్సో) చట్టం ప్రకారం నిందితుడైన ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. తొలుత స్థానిక కోర్టు ఎమ్మెల్యేపై హత్య కేసును నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. తాజాగా ఈ కేసులో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. డిసెంబర్ 19న సెంగార్‌కు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది.

English summary
The Delhi court on Tuesday deferred the sentencing of expelled BJP MLA Kuldeep Singh Sengar who was convicted for raping a woman in Unnao in 2017, to December 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X