వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే దోషి.. తేల్చిన కోర్టు, 19న శిక్ష ఖరారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడి ఉన్న బీజేపీ బహిష్కృత నేత కులదీప్ సింగ్ సెంగార్‌ను కోర్టు దోషిగా తేల్చింది.

ఉన్నావ్ బాధితురాలి తండ్రిపై దాడి, అంకుల్, పదేళ్ల చిన్నారికి బెదిరింపులు, ప్రియాంకగాంధీఉన్నావ్ బాధితురాలి తండ్రిపై దాడి, అంకుల్, పదేళ్ల చిన్నారికి బెదిరింపులు, ప్రియాంకగాంధీ

డిసెంబర్ 19న శిక్ష ఖరారు

డిసెంబర్ 19న శిక్ష ఖరారు

ఆగస్టు 5 నుంచి రోజువారీ విచారణ చేపట్టారు న్యాయమూర్తి ధర్మేష్ శర్మ. డిసెంబర్ 19న కులదీప్‌కు తీస్ హజారీ కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లక్నో కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు బదిలీ అయ్యింది. బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌పై ఆరోపణలు రావడంతో ఆ పార్టీ అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఉన్నావో ఘటనపై జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ తన ఛాంబర్‌లోనే (ఇన్ కెమెరా) విచారణ ముగించారు. సీబీఐ కూడా ఈ కేసుకు సంబంధించిన సాక్షాధారాలతో వాదన వినిపించింది. దీంతో ఆగస్టు 5 నుంచి కేసును ప్రతి రోజూ విచారణకు చేపట్టారు.

రెండేళ్ల క్రితం మైనర్‌పై జరిగిన దారుణం..

రెండేళ్ల క్రితం మైనర్‌పై జరిగిన దారుణం..

2017 సంవత్సరంలో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ ఆ మహిళను అపహరించి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. ఆమె అపహరణకు గురైనప్పుడు మైనర్ బాలికగా ఉంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని బెంగర్‌మౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సెంగార్ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో సెంగార్‌ను ఈ ఏడాది ఆగస్టులో బీజేపీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు

నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు


లైంగిక వేధింపుల నుంచి చిన్న పిల్లల సంరక్షణకు సంబంధించిన (పోక్సో) చట్టం ప్రకారం నిందితుడైన ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. తొలుత స్థానిక కోర్టు ఎమ్మెల్యేపై హత్య కేసును నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. తాజాగా ఈ కేసులో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు తీర్పు వెలువరించింది. డిసెంబర్ 19న సెంగార్‌కు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది.

బాధితురాలి ప్రాణం తీసేందుకు యత్నాలు..

బాధితురాలి ప్రాణం తీసేందుకు యత్నాలు..

కాగా జులై 28న బాధితురాలు తన బంధువులతో కారులో వెళ్తుండగా.. ఓ ట్రక్కు వారిని ఢీకొట్టింది. దీంతో బాధితురాలి ఇద్దరు మహిళా కుటుంబసభ్యులు మరణించారు. ఈ ప్రమాదానికి కారణం నిందితుడు కులదీప్ సింగేనని ఆరోపణలున్నాయి. విచారణకు హాజరయ్యేందుకు వెళుతుండగానే ఈ ప్రమాదం చోటు చోటు చేసుకోవడం గమనార్హం. అంతేగాక, బాధితురాలి తండ్రిపై అక్రమ ఆయుధాల కేసును కూడా పెట్టారు. 2018, ఏప్రిల్ 3న అతడ్ని అరెస్ట్ చేశారు. జుడీషియల్ కస్టడీలో ఉండగానే అతడు ఏప్రిల్ 9న మరణించాడు.

రక్షణ లేదంటూ ఢిల్లీలోనే బాధితురాలు..

రక్షణ లేదంటూ ఢిల్లీలోనే బాధితురాలు..

బాధితురాలు, ఆమె తల్లి, ఆమె అంకుల్ ఈ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్నారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో బాధితురాలి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది ప్రత్యేక కోర్టు. కారు ప్రమాదంలో గాయపడిన బాధితురాలిని లక్నో నుంచి హెలికాప్టర్‌లో ఎయిమ్స్‌కు తరలించారు. ఇక తాము తమ సొంత గ్రామంలో ఉంటే ప్రమాదకరమని భావించిన బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు ఢిల్లీలోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. కోర్టు ఆదేశాలతో బాధితురాలి కుటుంబానికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తోంది. ఢిల్లీ మహిళా కమిషన్ వారికి సహాయ సహకారాలు అందిస్తోంది.

English summary
A Delhi court on Monday convicted expelled BJP MLA Kuldeep Singh Sengar in the case of alleged kidnapping and rape of a woman in Unnao in 2017. The court has acquitted another accused Shashi Singh. Arguments on the sentencing to held on 19th December.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X