హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉన్నావ్ అత్యాచార ఘటన: నిరసనల సందర్భంగా ఆరేళ్ల కూతురుపై పెట్రోల్ పోసిన తల్లి

|
Google Oneindia TeluguNews

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కూతురికి సత్వర న్యాయం జరగాలంటే నిందితులను హైదరాబాద్ దిశ ఘటనలో పోలీసులు ఎలా అయితే ఎన్‌కౌంటర్ చేశారో అలానే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నావ్ ఘటనపై పార్లమెంటు సైతం దద్దరిల్లింది. ఓ వైపు హైదరాబాద్‌లో దిశ ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన రోజునే ఉన్నావ్ యువతికి దుండగులు నిప్పు పెట్టారు.

ఉన్నావ్ బాధితురాలు మృతి చెందిందని తెలుసుకున్న నిరసనకారులు పెద్ద ఎత్తున సఫ్దార్‌జంగ్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ తన నిరసనను తెలిపే క్రమంలో తన ఆరేళ్ల కూతురుపై పెట్రోల్ పోసింది. ఇది గమనించిన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని అమ్మాయిని చికిత్స కోసం అత్యవసర వార్డుకు తరలించారు. తన కూతురుపై పెట్రోల్ పోసినందుకు పోలీసులు మహిళను కస్టడీలోకి తీసుకున్నారు. ఆ ఆవేశంలో లేదా నిరసన తెలిపే క్రమంలో ఏమైనా జరిగి ఉంటే చిన్నారి ప్రాణానికే ప్రమాదం ఏర్పడి ఉండేది.

Unnao rape case protest:Woman throws Petrol on her 6 year old girl

ఇదిలా ఉంటే కోర్టుకు హాజరు అయ్యేందుకు వస్తుండుగా ఆమెపై కొందరు దుండగులు నిప్పు అంటించారు. దీంతో 90శాతం కాలిన గాయాలతో హాస్పిటల్‌లో చేరింది. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు తుదిశ్వాస విడిచింది.అంతకుముందు తనను బతికించాలని బాధితురాలు డాక్టర్లను వేడుకొందని వారు చెప్పారు. ఇక చివరి క్షణాల్లో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు నిందితుల పేర్లు చెప్పింది.

తను ఈ స్థితికి చేరడానికి కారణం శివం త్రివేది, శుభం త్రివేదితో పాటు హరిశంకర్ త్రివేది, ఉమేష్ బాజ్‌పాయ్, రామ్ కిషోర్ త్రివేదీలని పోలీసులకు చెప్పింది. రాయ్‌బరేలీ కోర్టుకు హాజరు అవుతుండగా తనను గౌరా క్రాసింగ్ వద్ద అడ్డుకుని కేసును విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారని వెల్లడించింది. మాట వినకపోవడంతో తనకు నిప్పు అంటించినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే నిందితులను పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చగా వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

English summary
A woman protesting against Unnao rape case, allegedly threw petrol on her six year old daughter outside safdarjung Hospital on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X