వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీకి ఉన్నావ్ లైంగికదాడి నిందితురాలు.. మెరుగైన చికిత్స కోసం..గ్రీన్ కారిడార్ ఏర్పాటు

|
Google Oneindia TeluguNews

ఉన్నావ్ బాధితురాలిపై నిందితులు నీడలా వెంటాడుతున్నారు. ఆమెపై దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించి తమలోని కర్కశాన్ని మరోసారి ప్రపంచానికి చాటారు. 90 గాయాలతో కూడా బాధితురాలి కిలోమీటర్ పరుగెత్తిన అంశం ప్రతీ ఒక్కరిని కలచివేస్తోంది. తొలుత ఆమెను లక్నో ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత సివిల్ ఆస్పత్రికి తరలించారు.

యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో ఢిల్లీకి తరలించారు. విమానంలో ఆమెను హస్తినకు తరలించారు. ఢిల్లీలోని సప్దర్‌జంగ్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 90 శాతం కాలిన గాయాలతో ఉండటంతో.. పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. పలెం ఎయిర్ పోర్టు నుంచి ఆర్మీ కంటోన్మెంట్ ఏరియా, ధౌలా కౌన్ క్రాసింగ్, రింగ్ రిండ్ మీదుగా ఆస్పత్రికి అంబులెన్స్ చేరుకుంది. వైద్యులు వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభించారు. గతేడాది డిసెంబర్‌లో నిందితులు యువతిపై లైంగికదాడి చేశారు. ఆ కేసుకు సంబంధించి రాయ్ బరేలి కోర్టులో సాక్షం ఇచ్చేందుకు వెళ్తుండగా కీచకులు దారుణానికి ఒడిగట్టారు.

Unnao rape case victim who was set on fire by accused airlifted to Delhi

ఉన్నావ్ జిల్లాలోని సిందుపూర్ వద్ద నిందితులు మరోసారి దాడి చేశారు. కత్తితో పొడిచి.. తర్వాత నిప్పంటించారని పేర్కొన్నారు. శివమ్, శుభమ్ త్రివేది సహా మరో ముగ్గురు కూడా ఉన్నారని బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. యువతిపై నిందితుల చర్యను మేధావులు, ప్రజాసంఘాల నేతలు తప్పుపడుతున్నారు. నిందితులను జైలులో పెట్టకుండా బహిరంగంగా తిరిగే స్వేచ్చ ఇస్తే.. పరిస్థితి ఇలానే ఉంటుందని మండిపడుతున్నారు. వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Unnao rape victim, who was set ablaze by five men on Thursday when she was on her way to a court in Rae Bareli in Uttar Pradesh, was airlifted to Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X