బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు, బాంబు పేల్చిన మాజీ సీఎం యడ్యూరప్ప, నిద్రలేకుండా చేశారు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎటువైపు వెలుతారు అంటే ఎవ్వరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బాంబుపేల్చి సంకీర్ణ ప్రభుత్వానికి నిద్రలేకుండా చేశారు.

కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి ఒంటికాలి మీద నిలబడ్డారని, సంకీర్ణ ప్రభుత్వానికి దడపుట్టుందని బీఎస్. యడ్యూరప్ప బాంబుపేల్చారు. శనివారం బెంగళూరులో బీజేపీ యువమోర్చ కార్యకర్తల సమావేశంలో బీఎస్. యడ్యూరప్ప మాట్లాడారు.

 Unsatisfied and upset Congress MLAs are ready to join BJP, says BS Yeddyurappa

శుక్రవారం కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంబి. పాటిల్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి వర్గ విస్తరణలో తమకు అన్యాయం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా 20 మంది శాసన సభ్యులు ఉన్నారని ఎంబి. పాటిల్ మీడియాకు చెప్పారు.

ఈ విషయంపై మాట్లాడిన బీఎస్. యడ్యూరప్ప మాజీ మంత్రులు ఎంబి. పాటిల్, సతీష్ జారకిహోళి తదితరులకు న్యాయం చెయ్యడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు ఎప్పుడైనా బీజేపీలో చేరే అవకాశం ఉందని బాంబుపేల్చిన బీఎస్. యడ్యూరప్ప కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి నిద్రలేకుండా చేశారు.

English summary
Karnataka Cabinet expansion: Unsatisfied and upset Congress leaders are ready to join BJP, says Karnataka BJP president and oppostion leader B S Yeddyurappa told in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X