వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ అనూహ్య చర్య: అన్ ప్లాన్డ్, అన్ షెడ్యూల్: హఠాత్తుగా గురుద్వారాలో: బందోబస్తు లేకుండా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనూహ్య చర్యను తీసుకున్నారు. దేశ రాజధానిలోని గురుద్వారా రికబ్ గంజ్ సాహిబ్‌ను ఆయన సందర్శించారు. సిక్కుల మత గురువు తేజ్ బహదూర్‌కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన చర్య ఏ మాత్రం ఊహించనిదే. ఈ ఉదయం ఆయన సాధారణ భక్తుడిలా గురుద్వారాకు వెళ్లారు. ఆయన రోజువారీ అధికారిక దినచర్యల షెడ్యూల్‌లో ఈ సందర్శన చేర్చలేదు. ప్రధానమంత్రి వస్తారని గురుద్వారా కమిటీ సభ్యులు కూడా ఊహించలేదు.

గురుద్వారా వద్ద ఎలాంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయలేదు. బ్యారికేడ్లను కూడా అమర్చలేదు. గురుద్వార కమిటీ సభ్యులకు కూడా కనీస సమాచారం లేదు. దీనితో వారు యధాతథంగా రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సమయంలో ప్రధాని అక్కడ కనిపించారు. సాధారణ భక్తుడిలా ఆయన గురుద్వారాను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లేత నారింజ రంగు జుబ్బా, ముందురు ఆరెంజ్ రంగు పైకోటు, తెలుపు పైజామా ధరించిన ఆయన హఠాత్తుగా గురుద్వారాలో ప్రత్యక్షం అయ్యారు. గురు తేజ్ బహదూర్ 400వ ప్రకాశ పర్వ్ సందర్భంగా ఆయన గురుద్వారాను సందర్శించారు.

ప్రధాని వస్తున్నారనే విషయం తెలియకపోవడంతో ఆయనను స్వాగతించడానికి కూడా గురుద్వారా వద్ద ఎవరూ కనిపించలేదు. తన కారు నంచి కిందికి దిగిన ఆయన వడివడిగా నడుచుకుంటూ గురుద్వారాలోనికి వెళ్లారు. గురు తేజ్ బహదూర్ మహాసమాధి ముందు ప్రత్యేక ప్రార్తనలను జరిపారు. తన వెంట తెచ్చిన సామాగ్రిని కమిటీ నిర్వాహకులకు అందజేశారు. కొద్దిసేపు వారితో మాట్లాడారు. గురుద్వారా నిర్వాహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుద్వారా నిర్వాహకులు, కమిటీ సభ్యులకు ఆయనకు సన్మానించారు. సెల్ఫీ తీసుకోవడానికి పోటీ పడ్డారు.

Unscheduled PM Modi visited Gurudwara Rakab Ganj Sahib in Delhi and paid tributes

Recommended Video

ఎలాంటి బందోబస్తు లేకుండానే గురుద్వారాలో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన

దీనికి సంబంధించిన వివరాలు, ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. గురు తేజ్ బహదూర్ మహాసమాధిని సందర్శించడం తనకు ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొట్టాదిమంది గురు తేజ్ బహదూర్ నుంచి స్ఫూర్తి పొందారని, తాను కూడా ఇందుకు మినహాయింపు కాదని చెప్పారు. గురు తేజ్ బహదూర్ జీవితం ఆదర్శప్రాయమని, ఆచరణీయమని వ్యాఖ్యానించారు.

English summary
In an unscheduled visited today morning, PM Narendra Modi visited Gurudwara Rakab Ganj Sahib in Delhi and paid tributes to Guru Teg Bahadur for his supreme sacrifice. There was also no police bandobast or traffic barriers to the common man during this visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X