వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: రైల్వే కరెంట్ తీగలపై వ్యక్తి సర్కస్ ఫీట్లు..సిబ్బంది ఎలా కాపాడారో చూడండి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Man Climb On 25000 Volts Railway Current Supply Wire In Dabra

ఝాన్సీ: మధ్యప్రదేశ్‌లో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. రైల్వే విద్యుత్ స్తంభంపైకి ఎక్కి దానిపై వేలాడే హై ఓల్టేజ్ తీగలపై నడిచే ప్రయత్నం చేశారు. ఈ ఘటన దబ్రా రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి తీగలపై నడిచేందుకు ప్రయత్నిస్తుండగా ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే ఆ దారిలో ఉన్న విద్యుత్‌ను నిలిపివేసింది. వెంటనే ఆ వ్యక్తిని కాపాడేందుకు సిబ్బంది రంగంలోకి దిగింది.

ఈ మొత్తం వ్యవహారంను అక్కడే ఉన్న కొందరు తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఈ హై ఓల్టేజ్ డ్రామాను చూసేందుకు ప్లాట్‌ఫాంకు ఇరువైపులా పెద్ద ఎత్తున జనాలు గుమికూడారు. ఇక వారంతా చూస్తుండగానే ఈ వ్యక్తి తీగలపై వేలాడుతూ కొన్ని సర్కస్ ఫీట్లు చేశాడు. ఇక మరో ఇంజిన్‌లో చేరుకున్న రైల్వే సిబ్బంది ఆ వ్యక్తిని కాపాడి కిందకు దించారు.

Unsound Man who was hanging from overhead wire saved by Railway staff

ఇదిలా ఉంటే ఆ వ్యక్తి చేసిన పనికి చాలా రైళ్లు గంటపాటు నిలిచిపోయాయి. విద్యుత్‌ను అధికారులు నిలిపివేయడంతో ఝాన్సీ రైల్వే డివిజన్‌లోని చాలా వరకు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గ్వాలియర్‌కు సమీపంలో ఉన్న దాబ్రా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. వ్యక్తికి మతిస్థిమితం లేదని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో ఈ వ్యక్తి స్తంభాన్ని పట్టుకుని పైకి ఎక్కాడని ఓ గార్డు చెప్పాడు. అక్కడి నుంచి చిన్నగా విద్యుత్ తీగలపైకి చేరుకుని అటు ఇటూ నడిచే ప్రయత్నం చేశాడని వెల్లడించారు. ఇది చూసి గార్డు అధికారుల దృష్టికి తీసుకువచ్చాడు. అయితే వ్యక్తి ఎక్కిన స్తంభంకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

విద్యుత్ సరఫరా ఉన్న మరో వైర్‌ను ఆ వ్యక్తి ముట్టుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని రైల్వే అధికారులు వెల్లడించారు. విషయం తమ దృష్టికి రాగానే మిగతా లైన్లకు సరఫరా అవుతున్న విద్యుత్‌ను నిలిపివేశామని చెప్పారు. అయితే ఆ వ్యక్తి చేసిన పనికి చాలా రైళ్లు నిలిచిపోగా మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు.

English summary
Government Railway Police (GRP) personnel on Tuesday rescued a youth who was dangling from an overhead wire at tracks on Dabra railway station in Madhya Pradesh. Electricity was switched off on the route by officials to carry out the rescue operations safely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X