• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూతురి అక్రమ సంబంధంపై తండ్రి ఫైర్ -అత్తింట్లో ప్రియుడితో పట్టుబడ్డ యువతి -చివరికి భారీ ట్విస్ట్

|

తల్లిదండ్రులు ప్రోత్సహించినా ఆ యువతికి చదువు ఎక్కలేదు. బడి వయసు నుంచే ప్రేమపాఠాలు దిద్దుకుంది. ఆమె తీరుతో విసిగిపోయి, టీనేజీ చివర్లోనే పెళ్లి చేసేశారు. అసలే తెలిసీ తెలీని వయసు. పాత ప్రేమలను ఠక్కున వదులుకోలేక.. భర్తతో కలిసుంటూనే ప్రియుడితో గుట్టుగా వ్యవహారం కొనసాగించిందా యువతి. అత్తారింటి నుంచి కూడా తన కూతురి అక్రమ సంబంధంపై ఫిర్యాదులు అందడంతో ఆ తండ్రి ఉన్మాదిలా మారిపోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

నిమ్మగడ్డ -జగన్ వార్: మధ్యలో మోదీ -ఎన్నికల వివాదంలోకి కేంద్రాన్ని లాగిన ఏపీ -రేపు ప్రధానితో సీఎం భేటీ

పాత ప్రియుడితో వ్యవహారం..

పాత ప్రియుడితో వ్యవహారం..

ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది, పెళ్లైనాకానీ తన పాత ప్రియుడితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న కూతుర్ని కన్నతండ్రి తుపాకీతో కాల్చి చంపాడు. ఫతేపూర్ జిల్లాలోని జైసింగ్ గ్రామంలో నివసించే స్వాతి అనే యువతి (20) కి ఇటీవల వివాహం జరిగింది. పెళ్లికి ముందు ఆమె మరోక వ్యక్తిని ప్రేమించింది. కానీ తల్లితండ్రులు చూసిన సంబంధం ఒప్పుకుని ఆతనితో తాళి కట్టించుకుని అత్తారింటికి వెళ్ళింది. తీరా..

అత్తారింట్లో పట్టుబడటంతో..

అత్తారింట్లో పట్టుబడటంతో..

పెళ్లై అత్తారింటికి వెళ్లి కొత్త కాపురం ప్రారంభించిన తర్వాత కూడా స్వాతి తన పాత ప్రియుడితో మాటలు కొనసాగిస్తూనే ఉంది. ఇది గ్రహించిన అత్తింటివారు ఇతర వ్యక్తులతో మాట్లాడవద్దని అభ్యంతరం చెప్పారు. అయినా ఆమె వినకుండా తన పాత ప్రియుడితో వ్యవహారం నడిపేది. ఓ రోజు పట్టుపడటంతో వారు ఆమె తండ్రి చంద్రమోహన్ కు విషయం చెప్పి గురువారం(జనవరి 7న) పుట్టింటికి పంపేశారు.

షాకింగ్: చికెన్ బిర్యానీతో బర్డ్ ఫ్లూ -రైతుల ద్వారా వైరస్ వ్యాప్తి -రంగంలోకి కేంద్రం: బీజేపీ ఎమ్మెల్యే

డబుల్ బ్యారల్ గన్..

డబుల్ బ్యారల్ గన్..

ఇంటికి వచ్చిన కూతురుకి హితబోధ చేసేందుకు తండ్రి చేసిన ప్రయత్నం చివరికి హత్యకు దారితీసింది. జైసింగ్ గ్రామంలోని ఇంట్లో కూతురికి నచ్చ చెప్పబోయాడా తండ్రి. పెళ్లైంది కనుక ఇలాంటి వ్యవహారాలుకట్టిపెట్టి బుధ్దిగా కాపురం చేసుకోమని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో తండ్రి కూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. కోపం పట్టలేని తండ్రితన డబుల్ బ్యారెల్ గన్ తీసి కుమార్తెను కాల్చిచంపాడు. ఆ తర్వాత..

తండ్రి లొంగుబాటు.. ఫ్యామిలీ పరార్

తండ్రి లొంగుబాటు.. ఫ్యామిలీ పరార్

పెళ్లైన తర్వాత కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తోన్న కూతురిని తుపాకితీ కాల్చేసిన తండ్రి చంద్రమోహన్.. నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అతనిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. డబుల్ బేరల్ గన్, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాతి హత్య తరువాత చంద్రమోహన్ భార్య, కుమారుడు ఇంట్లోంచి పారిపోయారు. పోలీసులు వారిని వెతికే పనిలో పడ్డారు. ఈ ఘటన జరగడానికి కొద్ది గంటల ముందు అదే యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది..

కూతురి అఫైర్.. తండ్రి కిరాతక హత్య

కూతురి అఫైర్.. తండ్రి కిరాతక హత్య

కూతురి ప్రేమ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు ఓ తండ్రి దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబసభ్యులే అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బోదాన్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బోదాన్‌ జిల్లా వాజిర్‌గంజ్‌ ఏరియా హత్రా గ్రామానికి చెందిన అమిర్‌కు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ విషయం అమిర్‌కు తెలియటంతో ఈ నెల 5వ తేదీన కూతుర్ని నిలదీశాడు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులకు అమిర్‌కు మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన వారు అతడిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. చికిత్స పొందుతూ బాధితుడు శుక్రవారం మృతిచెందాడు. కుటుంబసభ్యులు పరారీలో ఉండటంతో దగ్గరి బంధువులు, పొరిగింటివారు, పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.

English summary
A newly-married woman was allegedly shot dead by her father in Fatehpur district of Uttar Pradesh. According to the details, the 20-year-old woman, identified as Swati was accused by her in-laws of continuing her illicit relationship with her alleged lover. The accused father of the woman, Chandra Mohan Singh was reportedly upset over the development and fired three shots at Swati from a close-range killing her on the spot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X