వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విరాట్ కోహ్లీ.. అనుష్కకు విడాకులు ఇవ్వు: దేశ ద్రోహి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ హీరోయిన్, సినీ నిర్మాత అనుష్క శర్మపై బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అనుమతి లేకుండా తన చిత్రాన్ని వాడటంపై ఇప్పటికే ఆమెపై కేసు నమోదు చేసిన ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అనుష్కపై కేసు..

అనుష్కపై కేసు..

అనుష్క నిర్మించిన వెబ్ సిరీస్ ‘పాతాల్ లోక్' ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. కాగా, ఇందులోని ఓ సన్నివేశంలో నందకిశోర్ ఫొటోను ఉపయోగించారు. అయితే, తన అనుమతి లేకుండా ఫొటో వాడారంటూ నందకిశోర్.. అనుష్కపై కేసు నమోదు చేశారు.

మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా..

మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా..

అంతేగాక, వెబ్ సిరీస్‌ను నిషేధించమని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు. అనుష్క మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కారణమయ్యారని ఆమెపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుష్క దేశ ద్రోహి అని మండిపడ్డారు.

విరాట్.. అనుష్కకు విడాకులు ఇవ్వు..

విరాట్.. అనుష్కకు విడాకులు ఇవ్వు..

అనుష్క భర్త అయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కూడా ఈ వివాదంలోకి లాగారు. విరాట్ కోహ్లీకి దేశభక్తి ఉంది. ఆయన భారత్ తరపున ఆడుతున్నారు. ఆయన అనుష్కకు విడాకులు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ అన్నారు. కాగా, ‘పాతాళ్ లోక్' వెబ్ సిరీస్‌పై ఇప్పటికే గోర్ఖా వర్గం వారు కూడా మండిపడ్డారు. ఓ సన్నివేశంలో గోర్ఖా వర్గాన్ని కించపరిచేలా సంభాషణలున్నాయంటూ ఆల్ అరుణాచల్‌ప్రదేశ్ గోర్ఖా యూత్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేగాక, అనుష్కపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

English summary
BJP MLA Nand Kishore Gurjar of Uttar Pradesh has complained to Loni police station demanding action against Anushka Sharma, the producer of the web series.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X