ఆరేళ్ల బాలికను 9 ఏళ్ల బాలుడు రేప్ చేశాడట!
ఫిలిబిత్: అత్యాచారం కేసులో 9 ఏళ్ల బాలుడు ఉత్తరప్రదేశ్ అరెస్టయ్యాడు. అతను ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు చెబుతున్నారు. అతి పిన్న వయసులో రేపు చేసిన బాలుడిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుర్రాడు నిలిచినట్లుగా ఆ రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. ఫిలిబిత్ జిల్లాలోని మైతీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వైద్య పరీక్షల్లో బాలికపై లైంగిక దాడి జరిగినట్లుగా తేలింది. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు. బాలిక జాట్వా కులానికి చెందడంతో బాలుడిపై అట్రాసిటి కేసు సైతం నమోదైంది. బాలుడి వయస్సు 10 సంవత్సరాలకు మించి ఉండదు. గురువారం నాడు ఈ ఘటన జరిగింది. పొలంలో ఇద్దరు ఆడుకుంటుండగా అత్యాచారం జరిగిందని బాలిక సోదరుడు వెల్లడించాడు.
చాకెట్లు కొనుక్కునేందుకు బయటకు వెళ్లింది. ఆ సమయంలో బాలుడు ఆడుకోవడానికి పిలిచాడు. సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లాడు. అక్కడే ఈ దారుణ పనికి ఒడిగట్టాడు. కొంతసేపటి తర్వాత రక్తస్రావంతో బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. ఎంటని అడుగగా జరిగిన విషయం చెప్పింది.

విషయం వెలుగులోకి రావడంతో బాలుడు పారిపోయాడు. శుక్రవారం నాడు పట్టుబడ్డాడు. పోలీసులు బాలుడిని ప్రశ్నించగా ఆడుకుంటుండగా జరిగిపోయింది. ఆటాడుకున్నామని, మరేమీ చేయలేదని సమాధానం చెప్పాడు. బాలిక తల్లిదండ్రులు, వారి బంధువుల తీవ్ర ఆరోపణలతో బాలుడిపై కేసు నమోదు చేయాల్సి వచ్చింది.
జరిగిన సంఘటనపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా అధ్యక్షురాలు మధుగార్గ్, మహిళా హక్కుల ఉద్యమకారిని ప్రవీణ్ భండారీ మాట్లాడుతూ.. దేశంలో జువైనల్ నేరాలు పెరిగిపోయాయని, పోర్నోగ్రఫి, ఇంటర్‌నెట్, టీవీ, సినీమాల ద్వారా పిల్లలు త్వరితగతిన చెడుదారుల్లో పయనిస్తున్నారని అన్నారు. పిల్లలకు కౌన్సిలింగ్ అవసరం. సెక్స్ విద్యను సరైన పద్ధతిలో పిల్లలకు అవగాహన పరచాలని కూడా అన్నారు.












Click it and Unblock the Notifications