వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపి ఎన్నికలు: బాహుబలి, షోలే డైలాగ్స్‌తో కలర్

బాలీవుడ్ సినీ రంగంలో హిట్ చిత్రాల్లో ఉర్రూతలూగించిన ప్రముఖ డైలాగ్‌లు అలవోకగా జారిపోయాయి. ‘షోలే’, ‘బాహుబలి’, ‘దిల్ వాలే దుల్హానియా లే జాయంగే (డీడీఎల్‌జే)’ తదితర చిత్రాల్లోని డైలాగ్‌లు తమ ప్రత్యర్థులపై

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

లక్నో: దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరం దాదాపు తుది అంకానికి చేరుకుంటున్నది. అయితే అనూహ్య రీతిలో ప్రస్తుత ఎన్నికల సమరంలో ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మధ్య బాలీవుడ్ సినీ రంగంలో హిట్ చిత్రాల్లో ఉర్రూతలూగించిన ప్రముఖ డైలాగ్‌లు అలవోకగా జారిపోయాయి. 'షోలే', 'బాహుబలి', 'దిల్ వాలే దుల్హానియా లే జాయంగే (డీడీఎల్‌జే)' తదితర చిత్రాల్లోని డైలాగ్‌లు తమ ప్రత్యర్థులపై విమర్శలకు దిగారు.

UP campaign: Bollywood 'tadka' adds zing to political speeches

ఎస్పీ - కాంగ్రెస్ కూటమిని ప్రధాని నరేంద్రమోదీ.. 'ఆ గాలే లాగ్ జా'లోని డైలాగ్‌ను అనుకరిస్తూ వెక్కిరిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధీటుగా సమాధానం ఇచ్చారు. షారూఖ్ ఖాన్ నటించిన 'డీడీఎల్‌జే'లో మాదిరిగా లోక్‌సభ ఎన్నికల్లో అచ్ఛేదిన్ తీసుకొస్తానని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. 'షోలే'లో గబ్బర్ సింగ్ మాదిరిగా ఉత్తుత్తి కబుర్లు చెప్తున్నారని ఎదురుదాడికి దిగారు.

UP campaign: Bollywood 'tadka' adds zing to political speeches

అధికార సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించిన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్.. పలు బ్లాక్ బస్టర్ బాలీవుడ్ సినిమాల డైలాగులను తన ప్రత్యర్థులపైకి ప్రయోగించారు. గత నెల 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ కేంద్రంగా జరిగిన ఉమ్మడి ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీతో కలిసి ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు.

'దిల్వాలే దుల్హానియా లే జాయంగే' చిత్రంలో మాదిరిగా 2014 లోక్ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అచ్ఛే దిన్ (మంచి రోజులు) తెస్తానని ఇచ్చిన హామీ అమలులో విఫలమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. 'షోలే'లో గబ్బర్ సింగ్ మాదిరిగా నిజ జీవితంలో 'డెకాయిట్'గా మారిపోయారని ఎద్దేవా చేశారు.

UP campaign: Bollywood 'tadka' adds zing to political speeches

ప్రధానమంత్రి కూడా పలు సినిమాల్లో డైలాగులను తన ప్రత్యర్థులు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ, బీఎస్పీ అధినేత మాయావతిలపై విమర్శలకు వినియోగించారు. హత్యలు, కిడ్నాపులు, ఇతర దాడుల కేసులతో జైలుపాలైన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ.. బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైనంపైనా తనదైన శైలిలో మోదీ విమర్శలు సంధించారు.

'మౌ' నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ముఖ్తార్ అన్సారీ పోటీ చేశారు. పూర్వాంచల్ ప్రాంతంలోని 'మౌ' జిల్లా కేంద్రంలో జరిగిన సభలో ఈ అంశాన్నిలేవనెత్తారు. ఇటీవల హిట్ సాధించిన 'బాహుబలి' సినిమాలో బాహుబలిని కట్టయ్య ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. భారతదశంలోని వివిధ భాషల్లో నిర్మితమైన 'బాహుబలి' చలన చిత్రంలో 'కట్టయ్య' ఒక పాత్ర. ఇదే పాత్ర మొత్తం సినిమాను ధ్వంసం చేసింది.

UP campaign: Bollywood 'tadka' adds zing to political speeches

మౌ నుంచి పోటీ చేస్తున్న భారతీయ సమాజ్ పార్టీ అభ్యర్థి సుహేల్ దేవ్ 'కర్ర (బీజేపీ మిత్ర పక్షం భారతీయ సమాజ్ పార్టీ ఎన్నికల చిహ్నం గుర్తు)'కు ఒక అధికారం ఉందని, ఈ కర్ర సరైందని, దీనికి గల అధికారం మార్చి 11వ తేదీన వెలుగులోకి వస్తుందని మోదీ నొక్కి వక్కాణించారు.

ఇంతకుముందు ఎస్పీ - కాంగ్రెస్ పార్టీ కూటమి పొత్తు అపవిత్రమని తెలియజేసేందుకు 'ఆ గాలె లాగ్ జా' సినిమాలోని డైలాగ్‌ను ఉదాహరించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు '27 సాల్, యూపీ బిహల్' అనే నినాదంతో రైతు యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీకి.. 'ఆ గాలే లాగ్ జా'కు ఏ ప్రాతిపదికన అధికార సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఏమైందని నిలదీశారు.

English summary
Bollywood provided the perfect fodder for witty repartees this poll season as Prime Minister Narendra Modi, Chief Minister Akhilesh Yadav and Rahul Gandhi used dialogues from superhit films Sholay, Bahubali and DDLJ to launch attacks on rivals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X