వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ యాదవ్ ను పెంచింది ఈ శకుని మామే

అఖిలేష్ యాదవ్ నిక్కర్లు వేసుకుని వయసు నుంచి నాకు తెలుసు, అతని చదువు, ఎదుగుదల, వ్యక్తిగత జీవితం అన్నింటిలో నేను తోడ్పడ్డానని, నా అనుకున్న వాళ్లే మనల్ని ద్వేషిస్తే, మనల్ని వద్దునకుంటే ఎంత బాధపడతామో కదా

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మీద సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ యాదవ్ రాజకీయాల్లో ఇంకా పైకి ఎదగాలని, ఆయన మేలు కోరే వారిలో నేను ముందు వరుసలో ఉంటానని చెప్పడంతో సీఎం వర్గీయులు అబ్బా ఈయనలో (అమర్ సింగ్) ఎంత మార్పు వచ్చింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సమాజ్ వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ తో కలిసి ఢిల్లీ నుంచి లక్నో చేరుకున్న అమర్ సింగ్ ఎయిర్ పోర్టులో విలేకరులతో మాట్లాడారు. అఖిలేష్ నిక్కర్లు వేసుకున్న వయసు నుంచి నాకు తెలుసు.

అఖిలేష్ చదువు, ఎదుగుదల, వ్యక్తిత్వంలో, వ్యక్తిగత జీవితం అన్నింటిలో నేను తోడ్పడ్డానని అమర్ సింగ్ చెప్పారు. నా అనుకున్న వాళ్లే మనల్ని ద్వేషిస్తే, మనల్ని వద్దునకుంటే ఎంత బాధపడతామో కదా, ప్రస్తుతం నాది అదే పరిస్థితి అని అమర్ సింగ్ అన్నారు.

UP CM Akhilesh Yadav was 4, we Practically raised him, Says MP Amar Sing

అఖిలేష్ నాగురించి మాట్లాడేవన్నీ వింటే నా గుండె పగిలిపోతుందని అమర్ సింగ్ భావోద్వేగానికి గురైనారు. మరో మాట లేకుండా నన్ను పార్టీ నుంచి గెంటేయాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చెయ్యడంతో నన్ను మరింత బాధపెట్టిందని చెప్పారు.

షాక్: అఖిలేష్ యాదవ్ ఎన్నికల పొత్తు ఎవరితోనో తెలుసా ?

సొంతవాళ్లే మనల్ని ద్వేషిస్తే ఆ బాధ వర్ణనాతీతం అని అమర్ సింగ్ కంట నీళ్లు పెట్టుకున్నారు. నాకు రెండే రెండు కోరికలు ఉన్నాయని, ఒకటి ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ సుప్రీంగా ఉండాలని, రెండు అఖిలేష్ రాజకీయంగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.

అంతకు మించి నాకేదీ అక్కర్లేదు అని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అమర్ సింగ్ అన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ నుంచి లక్నో వస్తున్న ములాయం సింగ్ యాదవ్ కు స్వాగతం పలకడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించారు.

అయితే చివరి నిమిషంలో అఖిలేష్ యాదవ్ మనసుమార్చుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ వెంట అమర్ సింగ్ ఉన్నారని అఖిలేష్ కు తెలిసింది. శకుని మామ వెంట ఉంటే మనమెలా వెళతాం అని అఖిలేష్ వ్యాఖ్యానించారని ఆయన అనుచరులు అంటున్నారు. అమర్ సింగ్ ను అఖిలేష్ చాల సార్లు శకుని మామ అని అభివర్ణించిన విషయం ఆ పార్టీ నాయకులకు తెలిసిందే.

English summary
Akhilesh was four years old. His education, his private life, we have contributed to it, I am saddened at what he has said about me, Samajwadi Party MP Amar Singh said in Lucknow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X