వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి ఫ్యామిలీకి హ్యాట్సాప్: జాబ్‌మేళాకు అందరిలా క్యూలో మేనకోడళ్లు, ఆదిత్యనాథ్ రికమెండ్ చేసినా నో!

|
Google Oneindia TeluguNews

లక్నో: దాదాపు అన్ని పార్టీల ముఖ్య నేతలు, వారి బంధువులు ఏ స్థాయిలో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు.. ఆయా ప్రజాప్రతినిధులు తమ బంధుగణానికి పెద్ద పీట వేస్తారు. ఇక ఆయా పార్టీల్లోని కీలక నేతలు, ముఖ్య నేతలు గురించి, వారి బంధుగణానికి, స్నేహితులకు వారు ఇచ్చే ప్రాధాన్యత గురించి చెప్పవలసిన పనిలేదు.

నరేంద్ర మోడీ ఫ్యామిలీయే కాదు.. యోగి ఫ్యామిలి కూడా

నరేంద్ర మోడీ ఫ్యామిలీయే కాదు.. యోగి ఫ్యామిలి కూడా

నీ ప్రధాని నరేంద్ర మోడీ అందుకు భిన్నమని మనకు తెలిసిందే. ఓ ప్రధానమంత్రికి తల్లి అయినప్పటికీ మోడీ అమ్మ.. ఓ సాధారణ ఇంట్లోనే ఉంటున్నారు. మోడీ సోదరులు తమ జీవితం తాము గడుపుతున్నారు. గతంలో తాము ఉన్న జీవితమే గడుపుతున్నారు. సామాన్య జీవితం గడుపుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ కుటుంబం కూడా రాజకీయాలకు, ఆయన అధికారానికి దూరంగానే ఉంటోంది.

శబరిమల ఇష్యూ: కేరళ ప్రభుత్వం '3' వాదనలు, ట్విస్ట్ ఇచ్చిన ట్రావెన్‌కోర్ టెంపుల్ బోర్డుశబరిమల ఇష్యూ: కేరళ ప్రభుత్వం '3' వాదనలు, ట్విస్ట్ ఇచ్చిన ట్రావెన్‌కోర్ టెంపుల్ బోర్డు

వైరల్ అవుతున్న న్యూస్

వైరల్ అవుతున్న న్యూస్

యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి సోదరి సామాన్య దుకాణం పెట్టుకొని బతుకు వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు మరో ఆసక్తికర సంఘటన కూడా వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఉద్యోగమేళాకు యోగి కోడళ్లు సామాన్య విద్యార్థినుల్లా వచ్చారు. వారిని తీసుకొచ్చింది యోగి తండ్రి. తమ మనవరాళ్లను ఉద్యోగమేళాకు తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యోగిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఉద్యోగమేళాకు సామాన్యుల్లా యోగి కోడళ్లు

ఉద్యోగమేళాకు సామాన్యుల్లా యోగి కోడళ్లు

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నగరంలొ ఉద్యోగమేళా జరిగింది. అంతలో అక్కడికి ఇద్దరు అమ్మాయిలను తీసుకుని ఒక పెద్దయన ఆటోలో వచ్చారు. అంతేవాళ్లను చూసి అక్కడి అధికారులు, పొలీసులు, ఇతరులకు షాక్ కొట్టినట్టయింది. అందరూ బిత్తరపొయి నోరెళ్లబెట్టారు.

ఏందుకంటే అక్కడ జరుగుతున్న ఉద్యోగమేళా ఇంటర్యూకు వచ్చిన ఆ ఆడపిల్లలు ఇద్దరు సాక్ష్యాత్తూ యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ మేనకోడళ్లు. వారి పేర్లు లక్ష్మి రావత్, అర్చన. వారిని తీసుకుని వచ్చిన ఆ పెద్దాయన చేతిలో కర్ర, టోపీ పెట్టుకున్నారు. ఆయన యోగి తండ్రి ఆనందసింగ్.

అధికారుల మర్యాదలను సున్నితంగా తిరస్కరించారు

అధికారుల మర్యాదలను సున్నితంగా తిరస్కరించారు

ఆనంద సింగ్‌కు లక్ష్మిరావత్, అర్చనలు సొంత మనుమరాళ్ళు.
ఇక వారిని చూసి ప్రభుత్వ అధికారులు రాచమర్యాదలు చేయడం ప్రారంభించారు. కానీ అధికారుల రాచమర్యాదలను యోగి తండ్రి, యోగి కోడళ్లు సున్నితంగా తిరస్కరించారు. అమ్మాయిలను ముందుకు రమ్మని చెప్పారు. కానీ ఆ అమ్మాయిలు మాత్రం అందరితోపాటు లైన్లో ఇంటర్వ్యూకు వెళ్లారు.

ఉద్యోగం ప్రతిభ ఆధారంగా రావాలి.. సిఫార్స్ కాదు

ఉద్యోగం ప్రతిభ ఆధారంగా రావాలి.. సిఫార్స్ కాదు

దీనిపై ఆనందసింగ్ మాట్లాడుతూ... ఇంటర్యూలకు వెళ్తుంటే అక్కడ ఎలా విజయం సాధించాలో వారే నేర్చుకుంటారని చెప్పారు. ఉద్యోగాలు అనేవి ప్రతిభ ఆధారంగానే రావాలి కాని సిఫార్సుల ద్వారా కాదని చెప్పారు. రాజకీయాల్లో తమ వారసులకు, బంధువులకు, మిత్రులకు ఉద్దేశ్యపూర్వకంగా లబ్ధి చేకూరుస్తున్న వారందరికీ ఇది చెంపపెట్టు.

యోగి రికమెండ్ చేసినా నో

యోగి రికమెండ్ చేసినా నో

ఇంకా, ఆనందసింగ్ మాట్లాడుతూ.. ఒకవేళ తన కొడుకు యోగి ఆదిత్యనాథ్ వీళ్ల ఉద్యోగాలకు రికమెండ్ చేసినా అంగీకరించనని చెప్పారు. అయితే యోగి ఆదిత్యనాథ్ అలా చేయరని చెబుతున్నారు. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగినందునే యోగి ఆదర్శవంత సీఎం అయి అందరి మన్ననలు అందుకుంటున్నారని చెబుతున్నారు. తాము రాజకీయాల్లో ఉండి తమ కుటుంబ సభ్యులు, బంధువులకు లబ్ధి చేకూర్చని నేటి నాయకుల్లో మనం దాదాపు నరేంద్ర మోడీ తర్వాత యోగిని మాత్రమే చూడగలుగుతున్నాం.

English summary
Two nieces and father of Uttar Pradesh chief minister Yogi Adityanath Monday attended an employment fair organised by the Uttarakhand government in Haridwar like commoners on job hunt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X