వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ పాలిటిక్స్ : అఖిలేశ్, మాయా వైరివర్గాలతో కాంగ్రెస్ చెట్టపట్టాల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తులతో ముందుకెళ్తోంది. రాష్ట్రాలవారీగా పార్టీలతో కలిసి బరిలోకి దిగుతోంది. కొన్నిచోట్ల బలమైన పక్షాలు తమను దూరం చేయడంతో వారి వైరివర్గాలతో పొత్తు పెట్టుకొని ఝలకిస్తోంది. ఇటీవల యూపీలో ఎస్పీ, బీఎస్పీ మాత్రమే పోటీచేస్తామని ప్రకటించడంతో అందుకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.

పైకి అలా .. చేసేదిలా ...

పైకి అలా .. చేసేదిలా ...

ఉత్తర్ ప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ ఓట్లలో చీలిక రాకుండా చూసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ లోలోపల మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. బీఎస్పీ చీఫ్ మాయావతి అంటే గిట్టని యూపీ దళిత నేత, భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తో యూపీ కాంగ్రెస్ పశ్చిమ ఇంచార్జీ ప్రియాంక గాంధీ సమావేశమవడం ఇదివరకు కలకలం రేపగా .. తాజాగా ప్రగతిశీల్ సమాజ్ వాదీ నేత శివపాల్ యాదవ్ తో సమావేశమమయ్యారు.

 12 స్థానాల్లో పోటీ ..

12 స్థానాల్లో పోటీ ..

ఢిల్లీలో రహస్యంగా భేటై .. 12 చోట్ల కాంగ్రెస్ మద్దతుతో శివపాల్ పార్టీ పోటీ చేసేందుకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బాబాయి అయిన శివపాల్ యాదవ్ తో కాంగ్రెస్ జట్టుకట్టి .. ఇదివరకు బీఎస్పీ, ఇప్పుడు ఎస్పీకి కూడా షాకిచ్చినట్టైంది. అసలే శివపాల్ అంటే అఖిలేవ్ కు పడదు. ఈ క్రమంలో శివపాల్ తో ప్రియాంక భేటీ ఆసక్తి కలిగిస్తోంది.

ప్రచారంలో కాంగ్రెస్ న్యూ స్ట్రాటజీ .. జలమార్గం ద్వారా ప్రియాంక క్యాంపెయిన్ప్రచారంలో కాంగ్రెస్ న్యూ స్ట్రాటజీ .. జలమార్గం ద్వారా ప్రియాంక క్యాంపెయిన్

సేట్ స్ట్రాటజీ ఆప్లై ...

సేట్ స్ట్రాటజీ ఆప్లై ...

అఖిలేశ్, రాహుల్ మధ్య స్నేహం ఉన్న .. ఎన్నికల్లో మాత్రం ఎస్పీ, బీఎస్పీ మాత్రమే పోటీచేస్తామని ప్రకటించాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా మీతో కలిసి పనిచేస్తామని చెప్పకుండా ప్రత్యామ్నాయలను చూసి అడుగులేసింది. అందులో భాగంగానే చంద్రశేఖర్ ఆజాద్, శివపాల్ యాదవ్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

యూపీలో శివపాల్ ప్రభావం

యూపీలో శివపాల్ ప్రభావం

తన సోదరుడు కుమారుడు అక్షయ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఫిరోజాబాద్ నుంచి బరిలోకి దిగుతానని శివపాల్ యాదవ్ స్పష్టంచేసినట్టు సమాచారం. ఎస్పీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శివపాల్ కు .. యూపీలో మంచి పట్టుంది. ఆయన పోటీచేసే స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అఖిలేశ్, మాయావతి అనుసరించిన వైఖరిని కాంగ్రెస్ పార్టీ అవలంభించి దెబ్బకొట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. .

English summary
The Congress party says it will not split SP and BSP votes in Uttar Pradesh. But in the underground is acting in contradiction. BSP chief Mayawati is the Bhim army chief Chandrasekhar Azad with the Priyanka Gandhi is meeting previously.. now leader Pragati Salian wave leader Shivpal Yadav. In the Delhi, secretly, has been approached by the Shivpal party to contest 12 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X