వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాథ్రస్: డెరెక్ ఓబ్రెయిన్ సహా టీఎంసీ అడ్డగింత, కిందపడిపోయిన ఎంపీ(వీడియో)

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్ ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. హాథ్రస్‌కు వెళ్లకుండా అడ్డకుని వారిని వెనక్కి పంపారు. ఈ సందర్బంగా వీరి మధ్య తోపులాట చేసుకుంది.

జాయింట్ మేజిస్ట్రేట్ ప్రేమ్ ప్రకాశ్ మీనా.. రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌ను పట్టుకుని వెనక్కి పంపించేశారు. ఈ ప్రయత్నంలో ఎంపీ డెరెక్ కిందపడిపోయారు. దీంతో వెంటనే అతడ్ని లేపిన జాయింట్ మేజిస్ట్రేట్ అక్కడ్నుంచి బలవంతంగా తరలించారు.

UP: Derek O’Brien manhandled, pushed to ground as police stop TMC MPs from entering Hathras

ఢిల్లీ నుంచి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు ఈ టీఎంసీ ఎంపీలు. 19ఏళ్ల అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు టీఎంసీ ఎంపీల బృందం హాథ్రస్ వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించేశారు.

ఆ టీఎంసీ ఎంపీల బృందంలో డెరెక్ ఓబ్రెయిన్, డాక్టర్ కకోలి ఘోష్ దస్తిదార్, ప్రతిమ మండల్, మమతా ఠాకూర్(మాజీ ఎంపీ)లు ఉన్నారు. కాగా, పోలీసులు అడ్డుకోవడంపై ఎంపీ డెరెక్ స్పందిస్తూ.. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న తమను అడ్డుకున్నారని, తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. మా వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవని, అయినా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఇక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందన్నారు.

Recommended Video

Rajya Sabha Passes 2 Agriculture Bills వ్యవసాయమంతా కార్పొరేట్ల చేతిలోకి : కాంగ్రెస్ || Oneindia

కాగా, ఎంపీలను అడ్డుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని గురువారం పోలీసులు దౌర్జన్యం చేశారని, ఇప్పుడు టీఎంసీ ఎంపీలను అడ్డుకున్నారని విమర్శించారు. కాగా, రాహుల్, ప్రియాంకలతోపాటు సుమారు 200 మందిపై కేసు పెట్టారు.

English summary
Adelegation of Trinamool Congress MPs was stopped by the Uttar Pradesh Police from entering Hathras on Friday. Visuals from the scene show Joint Magistrate Prem Prakash Meena pushing Rajya Sabha MP Derek O’Brien to the ground after a scuffle broke out between the police and the delegation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X